ఈసీపై పోరాటానికి సిద్దం : కనకమేడల
కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఎంతటి పోరాటానికైనా తాము సిద్దంగా ఉన్నామని టీడీపీ ఎంపీ కనకమేడల ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఏపీలో అధికారుల బదిలీపై సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేశారు. గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి కనకమేడల మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం రాసిన లేఖను ఈసీకి అందజేశామన్నారు.
బీజేపీ, వైసీపీ చెప్పినట్లుగానే ఈసీ పనిచేస్తోందనీ..వైసీపీ చేసిన ఫిర్యాదులకు మాత్రమే ఈసీ స్పందిస్తోందని అన్నారు. గతంతో తాము 150 ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకూ ఈసీ స్పందించలేదని తెలిపారు. పార్టీ ఆఫీసుకు వెళ్లి వచ్చినగానే విజయసాయిరెడ్డి ఈసీ ఆఫీసుకు వెళ్లి వస్తున్నారనీ ..తమ విషయంలో మాత్రం స్పందించని ఈసీపై ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ఎటువంటి కారణాలు లేకుండానే..కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండానే శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేశారని అన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కనకమేడల విమర్శించారు.
Read Also : మీ పద్దతి బాగోలేదు : ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు