పెళ్లికి ముందు సహజీవనం: జార్ఖండ్ గిరిజన గ్రామాల్లోని యువత

పెళ్లి ఖర్చు భరించుకోలేని గిరిజన యువత ఏళ్ల తరబడి సహజీవనం చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో ఇలా సహజీవనం చేస్తున్న 132 మందికి నిమిట్ స్వఛ్చంద సంస్ధ ఇటీవల సామూహిక వివాహాలు జరిపించింది.

  • Published By: chvmurthy ,Published On : January 18, 2019 / 07:14 AM IST
పెళ్లికి ముందు సహజీవనం: జార్ఖండ్ గిరిజన గ్రామాల్లోని యువత

Updated On : January 18, 2019 / 7:14 AM IST

పెళ్లి ఖర్చు భరించుకోలేని గిరిజన యువత ఏళ్ల తరబడి సహజీవనం చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో ఇలా సహజీవనం చేస్తున్న 132 మందికి నిమిట్ స్వఛ్చంద సంస్ధ ఇటీవల సామూహిక వివాహాలు జరిపించింది.

రాంచీ : అభివృధ్ది చెందిన భారతదేశంలో పెళ్లిలో విందు ఇవ్వటానికి డబ్బులు లేని గిరిజన జంటలు ఏళ్ల  తరబడి పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో ఈ తరహా సాంప్రదాయం ఏళ్ల తరబడి సాగుతోంది. చార్కాట్ గ్రామంలోని రాజు మహ్లీ,మంకీ దేవీలు పెళ్లి చేసుకోకుండానే 20 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. గిరిజనుల్లో వివాహ సమయంలో విందు ఇవ్వటం తప్పనిసరి. అందుకయ్యే ఖర్చు భరించలేని యువతి స్ధానిక గిరిజన సాంప్రదాయం ప్రకారం తాను సహజీవనం చేయాలనుకునే యువకుడ్ని ఎంపిక చేసుకుని గ్రామ పెద్దల అనుమతితో  అతనితో కలిసి జీవిస్తుంది. దుకా, దుక్నీల పేరుతో వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి కాపురం చేస్తారు. వీరికి పుట్టిన పిల్లలకు ఎటువంటి  చట్ట బద్దమైన హక్కులు కల్పించబడవు. పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేయటం జార్ఖండ్ రాష్ట్రంలోని ఒరాన్, ముంద, హో గిరిజన తెగల్లో కనిపిస్తోంది. 
జార్ఖండ్ లోని కుంతీ, గుమ్లా వంటి పలు గిరిజన గ్రామాల్లో వీరిలాగా సహజీవనం చేస్తున్న 132 జంటలను గుర్తించిన నిమిట్ అనే స్వఛ్చందసంస్ధ జనవరి 14న వారందరికీ సామూహిక వివాహాలు జరిపించి వారి బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేసింది. నిమిట్ స్వఛ్చంద సంస్ధకు కోల్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సహకారం అందించాయి. వివాహం చేసుకున్న 132 జంటలకు, వారి పిల్లలకు ఇక నుంచి చట్ట బద్దత వస్తుంది. 
పేదరికం వల్ల ఇలా పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటలకు తాము సామూహికంగా వివాహాలు జరిపిస్తున్నామని నిమిట్ట స్వచ్చంద సంస్థ కార్యదర్శి నికిత సిన్హా  తెలిపారు. ఇలా  21 జంటలకు 2016లో, 43 మందికి 2017లో , ఈ ఏడాది 132 జంటలకు సామూహిక వివాహాలు జరిపించినట్లు నికితసిన్హా వివరించారు.