లాక్ డౌన్ : ఆకలి తట్టుకోలేక కప్పలను తిన్న చిన్నారులు
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.

కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు.
కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ వల్ల పేదలకు పస్తులు తప్పడం లేదు. ఆకలి తీర్చే నాథుడు లేక రోజుల తరబడి ఉపవాసం ఉండలేక కొంతమంది చిన్నారులు కప్పలను తింటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాళ్లోకి వెళ్తే… లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది పేదలకు పూట గడవటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జెహనాబాద్ కు చెందిన కొందరు చిన్నారులు ఆకలితో అలమటించారు. ఐదురోజులుగా తిండి లేకపోవడంతో కప్పలను తింటూ కడుపు నింపుకుంటున్నారు. అందుకోసం గుంతల్లో, మురికి కాలువలో ఉన్న కప్పలను వేటాడి చంపి, వాటిని ఆహారంగా తింటున్నారు.
ఇది చూసిన కొంతమంది ఎందుకు కప్పలను తింటున్నారని ప్రశ్నించిగా అన్నం తినక ఐదు రోజులవుతుందంటూ చిన్నారులు వారి దయనీయ పరిస్థితిని వెల్లడించారు. ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేవని, ఆహారం సంపాదించడం అసాధ్యమన్నారు.
అందుకే మరో మార్గం లేక కప్పలను తింటున్నామని తమ విషాద గాథను చెబుతూ కంటతటి పెట్టించారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో అందరిని కదిలించింది. సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Also Read | BMW ఇండియా సీఈవో కన్నుమూత