Lok Sabha elections 2024: ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ

Lok Sabha elections 2024: పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని నిర్ణయించుకున్న 85 సంవత్సరాల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు.

Lok Sabha elections 2024: ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ

పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన ఓటింగ్ శాతం
 

అభ్యర్థుల గురించి తెలుసుకోండి: హీరో సూర్య
తమిళనాడు: హీరో సూర్య చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు వేసే ముందు ప్రతి ఒక్కరూ తమ అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని అన్నారు.

 

సిక్కింలో 21.20 శాతం..
అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉదయం 11 గంటల వరకు 19.46 శాతం, సిక్కింలో 21.20 శాతం పోలింగ్ నమోదైంది.

ఓటు వేసిన రజినీకాంత్ 
తమిళనాడు: సినీనటుడు రజినీకాంత్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, సద్గురు, కమలహాసన్, ధనుశ్ కూడా ఓటు వేశారు.

ఓటు హక్కును వినియోగించుకోవాలి: మోదీ 
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా ఓటర్లను ఓటు హక్కును రికార్డు స్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి ఓటు లెక్కించబడుతుందని, ప్రతి గొంతుక ముఖ్యమైనదని అన్నారు.

పోలింగ్ షురూ 
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని నిర్ణయించుకున్న 85 సంవత్సరాల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సంఘం సక్షం యాప్ ద్వారా పిడబ్ల్యుడి ఓటరు వీల్ చైర్ సౌకర్యాలు కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇవాళ 16.63 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 102 స్థానాల్లో మొత్తం 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1,625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు.

ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను కఠినంగా నియంత్రించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోందగి. 24 గంటలూ బృందాలతో నిఘా ఉంచింది. 1374 అంతర్ రాష్ట్ర, 162 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. 102 లోకసభా నియోజకవర్గాల పరిధిలో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.


Congress Vs Brs : ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు- కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు