Maharashtra: కొలిక్కి వచ్చిన చర్చలు.. మహారాష్ట్ర కొత్త సీఎం ఫడ్నవీస్..? ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే..

బీజేపీ పెద్దలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ తోపాటు ఒకరిద్దరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ..

Maharashtra: కొలిక్కి వచ్చిన చర్చలు.. మహారాష్ట్ర కొత్త సీఎం ఫడ్నవీస్..? ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే..

Maharashtra CM

Updated On : December 2, 2024 / 8:42 AM IST

Maharashtra New CM 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కూటమిలో బీజేపీ, శివసేన ( ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలు కలిసి పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థులు 132 స్థానాల్లో, శివసేన 57, ఎన్సీపీ అభ్యర్థులు 41 స్థానాల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఆపధర్మ సీఎంగా ఏక్నాథ్ షిండే కొనసాగుతున్నారు. అయితే, ఎన్నికల ఫలితాల నాటినుంచి మహారాష్ట్ర నూతన సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేందుకు బీజేపీ సంసిద్ధంగా లేదు. మరోవైపు.. ముఖ్యమంత్రి పీఠం మాదేనని షిండే వర్గం బాహాటంగానే ప్రకటిస్తుంది. అజిత్ పవార్ ఫడ్నవీస్ కు తన మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ముగ్గురు నేతలతో భేటీ అయ్యారు. అయినా సీఎం పీఠంపై కూర్చునేది ఎవరనే విషయంపై స్పష్టత రాలేదు.

Also Read: Bangladesh Hindus : బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్‌లా మారుతోందా? హిందువులపై దాడుల వెనక కుట్ర ఉందా?

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ పెద్దల తీరుకు నిరసనగా ఏక్నాథ్ షిండే అలిగి తన సొంత గ్రామానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కూటమిలో చీలికలు వస్తాయని పుకార్లు షికారు చేశాయి. ఆదివారం సాయంత్రం స్వగ్రామం నుంచి ముంబయి చేరుకున్న షిండే మాట్లాడుతూ.. తాను ఏమాత్రం అసంతృప్తితో లేనని, ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థికి తాను సంపూర్ణ మద్దతిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, ముఖ్యమంత్రి పీఠంకోసం పట్టుదలతో ఉన్న ఏక్నాథ్ షిండేతో బీజేపీ కేంద్ర పెద్దలు పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా షిండే దిగొచ్చినట్లు కూటమి నేతల్లో చర్చ జరుగుతుంది.

Also Read: Priyanka Gandhi: ఆ శక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం: ప్రియాంకా గాంధీ

బీజేపీ పెద్దలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ తోపాటు ఒకరిద్దరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఫైనల్ గా ఫడ్నవీస్ వైపే బీజేపీ అధినాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. దీంతో సోమవారం బీజేపీ శాసన సభ్యులు సమావేశమై ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవీస్ ను ఎన్నుకుంటారని సమాచారం. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ముంబయిలో సోమవారం మధ్యాహ్నం జరిగే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే, ఈ సమావేశం జరగకపోతే.. రేపు, ఎల్లుండి జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం ముంబైలోని అజాద్ మైదాన్లో జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు పాల్గొననున్నారు. అయితే, డిసెంబర్ 5న ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణస్వీకారం చేస్తారా.. లేక మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.