Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో మూడో వేవ్ కరోనా ముందుగా తలుపు తట్టిన ముంబైలో ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి.

Maharashtra Corona: మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు

Maharashtra Corona

Updated On : January 25, 2022 / 1:18 PM IST

Maharashtra Corona Update: దేశంలో మూడో వేవ్ కరోనా ముందుగా తలుపు తట్టిన ముంబైలో ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో కొత్త కరోనా కేసులలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో, రాష్ట్రంలో 28వేల 286 కొత్త కరోనా కేసులు నమోదవగా.. ఈ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఇదే సమయంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతకుముందు రోజుతో పోలిస్తే సోమవారం కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం, 40,805 కరోనా కేసులు నమోదవగా.. సోమవారం కేసుల కంటే 12,519 ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75లక్షల 35వేల 511కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,42,151 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల్లో కూడా తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24గంటల్లో మహారాష్ట్రాలో 86 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 2,845కి చేరుకుంది. వీరిలో 1,454మంది రోగులు కోలుకున్నారు. ముంబైలో కొత్తగా 1,857 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది ఒక రోజు ముందు నమోదైన కేసుల కంటే 693 తక్కువ.