గాంధీపై జాతి వివక్షత.. నల్లజాతి వాడని రైల్లో నుంచి నెట్టేశారు

  • Published By: sreehari ,Published On : October 1, 2019 / 10:18 AM IST
గాంధీపై జాతి వివక్షత.. నల్లజాతి వాడని రైల్లో నుంచి నెట్టేశారు

Updated On : October 1, 2019 / 10:18 AM IST

అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అనంతరం గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రైలు ఎక్కిన గాంధీకి అడుగుడుగునా అవమానాలే ఎదురయ్యాయి. తెల్లవాడు కాదనే కారణంతో ఆయన్ను రైల్లో నుంచి బయటకు నెట్టివేశారు. నల్లజాతి వారికి రైల్లో ప్రవేశం లేదని ఘోరంగా అవమనించారు. ఆయన గాంధీ ఎంతమాత్రం ధైర్యం కోల్పో లేదు. తన మనస్సును ఇంకా ధృడపరుచుకుని ముందుకు సాగారు. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివారు. అప్పుడే గాంధీకి చదువు, వ్యక్తిత్వం, ఆలోచనా సరళీలో మార్పులు వచ్చాయి. 

బారిస్టర్ పూర్తి చేసి స్వదేశానికి : 
1891లో బారిస్టర్ పూర్తి చేసి లండన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చారు. అనంతరం ముంబాయి, రాజ్‌కోట్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ, గాంధీ ఆ వృత్తిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గాంధీజీ 1893లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో లా కంపెనీలో ఏడాది పాటు కాంట్రాక్టు న్యాయవాదిగా పనిచేశారు. ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. ట్రాన్స్ వాల్ నగరంలో ఫోక్స్ ఆశ్రమాన్ని స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపియన్ అనే వార పత్రికను స్ధాపించారు. 

నాయకత్వ బీజాలు పడింది ఇక్కడే : 
1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసుకున్నాడు.

ఏడాది వరకు పనిమీద వెళ్ళిన గాంధీ.. దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుంచి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైల్లో మొదటి తరగతి నుంచి నెట్టివేశారు. హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతను గాంధీ ఎదుర్కొన్నారు. అప్పుడే రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికి పునాది పడింది. దేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు పడ్డాయి. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తోంది.