Gandhi Grandson: మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత..
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.

Mahatama Gandhi Grandson Arun Gandhi
Gandhi Grandson: జాతిపిత మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ (89) కన్నుమూశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూసినట్లు కుమారుడు తుషార్ గాంధీ చెప్పారు. కొల్లాపూర్‌లోని వాషి, నంద్వాల్ రోడ్ లోని గాంధీ ఫౌండేషన్ ప్రాంగణంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, అరుణ్ గాంధీ తన చివరి రోజులను అవని అనే సంస్థతో అనుబంధం కలిగిఉన్న క్యాంపస్‌లో గడిపారు.
జాతిపిత మహాత్మాగాంధీ నలుగురు కుమారుల్లో రెండవ కుమారుడైన సుశీలా మష్రువాలా, మణిలాల్ గాంధీ దంపతులకు అరుణ్ గాంధీ 1934 ఏప్రిల్ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జన్మించారు. 1957లో సునందతో ఆయన వివాహం జరిగింది. కొద్దికాలం తరువాత.. వారిని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశంలోకి అనుమతించదన్న విషయం తెలుసుకున్న వారు భారత దేశంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, 1987లో సునంద, అరుణ్ గాంధీ తిరిగి అమెరికా వెళ్లిపోయారు. 1991లో మెంఫిస్ టేనస్సీలోని క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్శిటీలో ఎంకే గాంధీ ఇనిస్టిట్యూట్ ఫర్ అహింసకు సంబంధించిన సంస్థను స్థాపించారు. అరుణ్ గాంధీ, సునందలకు కుమారుడు తుషార్ గాంధీ, కుమార్తె అర్చన ఉన్నారు. మనవరాళ్లూ ఉన్నారు. అతని సతీమణి సునంద 2007లో మరణించారు.
Nara Lokesh : ఆయన చంద్రబాబుని పొగిడితే మీకెందుకు అంత మంట?- వైసీపీ నాయకులపై లోకేశ్ ఫైర్
అరుణ్ గాంధీకి రచయిత, సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు ఉంది. ది గిఫ్ట్ ఆఫ్ యాంగర్, అదర్ లెసన్స్ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మహాత్మా గాంధీ అనే పుస్తకాలను రాశారు. అరుణ్ గాంధీ వృత్తిరిత్యా జర్నలిస్టు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 30ఏళ్లు విధులు నిర్వర్తించారు. వరుణ్ గాంధీ మృతిపట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. పలువురు రాజకీయ, ఇతర వర్గాల ప్రముఖులు అరుణ్ గాంధీ మృతి పట్ల నివాళులర్పించారు.