స్వామియే శరణం అయ్యప్ప: నేడే మకరజ్యోతి దర్శనం

  • Published By: vamsi ,Published On : January 15, 2020 / 02:34 AM IST
స్వామియే శరణం అయ్యప్ప: నేడే మకరజ్యోతి దర్శనం

Updated On : January 15, 2020 / 2:34 AM IST

శబరిమలలో మకర జ్యోతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధనుర్మాసం కంటే ముందు నుంచి జనం శబరిమలకు క్యూ కడతారు. దేశం నలుమూలల నుంచి మాలధారణ చేసిన వారు కరిమల వాసుని వైపుకు పరుగులు పెడతారు. మండల పూజులు పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. అందులోనూ మకర జ్యోతి దర్శనం కోసం రెండు, మూడు రోజుల ముందు నుంచే అడవుల్లో మకాం వేస్తారు అయ్యప్ప భక్తులు. సాధారణంగా మకర జ్యోతికి వచ్చేది ఎప్పుడు మకర సంక్రాంతి రోజున వస్తుంది. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుందనే విషయంలో అనుమానాలు కూడా ఉన్నాయి.

ఒక్కొక్క విధంగా గంటల వ్యవధిలో నిర్ణయిస్తారు. ఎక్కువ సార్లు జనవరి 14న వచ్చే మకర సంక్రాంతి ఈ పర్యాయం జనవరి 15న వస్తోంది. దీనికి అనుగుణంగానే మకరు విళక్కు పూజలు ప్రారంభం అవుతాయి. డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు స్వామివారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తారు. అనంతరం జనవరి 21న పడిపూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ విషయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు కూడా ప్రకటించింది.

మకర సంక్రాంత్రి జనవరి 15న కాబట్టి, అదే రోజు మకరజ్యోతి దర్శన ఉంటుందని స్పష్టం చేసింది. మకరు విలక్కు అంటే మకర జ్యోతి తరువాత ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుంది. స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుయి. జనవరి 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు. సాయంత్రం 6గంటల 45నిమిషాలకు మకరజ్యొతి దర్శనం కనిపించనుంది.