Mamata Banerjee : భారత్ ని తాలిబన్ గా చేయడాన్ని అనుమతించం మోదీజీ

మోదీ ప్రభుత్వాన్ని తాలిబన్ తో పోల్చారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

Mamata Banerjee : భారత్ ని తాలిబన్ గా చేయడాన్ని అనుమతించం మోదీజీ

Mamata (2)

Updated On : September 22, 2021 / 7:33 PM IST

Mamata Banerjee మోదీ ప్రభుత్వాన్ని తాలిబన్ తో పోల్చారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మమత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం భవానీపూర్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మమత..ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మమత మాట్లాడుతూ…నరేంద్రమోదీ జీ,అమిత్ షా జీ,భారతదేశాన్ని తాలిబాన్ లాగా చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించం. భారతదేశం సమైక్యంగానే ఉంటుంది..గాంధీజీ,నేతాజీ,వివేకానంద,సర్థార్ వల్లభాయ్ పటేల్,గురునానక్ జీ,గౌతమ్ బుద్ధ,జైనులు అందరూ దేశంలో కలిసిమెలిసి ఉంటారు. భారత్ ను విభజించాలనుకునే ఎవ్వర్నీ వదలిపెట్టం అని దీదీ అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీని ఒక జుమ్లా పార్టీగా అభివర్ణించారు దీదీ. బెంగాల్ లో తన ప్రభుత్వం దుర్గా పూజకి,లక్ష్మీ పూజకి అనుమతివ్వదు అంటూ బీజేపీ అబద్దాలు చెబుతోందని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు.