దారితప్పిన మమత హెలికాఫ్టర్

 వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది.

  • Published By: venkaiahnaidu ,Published On : April 10, 2019 / 01:46 PM IST
దారితప్పిన  మమత హెలికాఫ్టర్

Updated On : April 10, 2019 / 1:46 PM IST

 వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది.

 వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెలికాప్టర్ బుధవారం(ఏప్రిల్-10,2019)కొద్దిసేపు దారితప్పడం అందరికీ చెమటలు పట్టించింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం(ఏప్రిల్-10,2019) బంగ్లాదే‌శ్‌ బోర్డర్ దగ్గర్లోని చోప్రాలో మమతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆమె సిలిగురిలో హెలికాప్టర్ ఎక్కారు.చోప్రాకు 1.27 గంటలకు హెలికాప్టర్ చేరాల్సి ఉండగా, 2 గంటల తర్వాత అక్కడకు చేరుకుంది.
Read Also : నక్సల్స్ దాడి వెనుక రాజకీయ కుట్ర

బహిరగం సభలో ఈ విషయాన్ని మమత ప్రస్తావిస్తూ….ఆలస్యంగా వచ్చినందుకు సారీ. సభాస్థలిని పైలట్ గుర్తించలేకపోవడంతో ఆలస్యం చోటుచేసుకుంది. ఆయన డైరెక్షన్ మర్చిపోయారు. 22 నిమిషాల్లోనే నేను ఇక్కడకు చేరుకోవాల్సి ఉండగా 55 నిమిషాలు పట్టింది అని ఆమె తెలిపారు. హెలికాప్టర్ పొరపాటున బీహార్‌లోకి అడుగుపెట్టిందని, దీంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, కలర్ట్ స్మోక్ గన్ సహాయంతో హెలికాప్టర్‌ను చోప్రాలో సురక్షితంగా పైలెట్ దింపగలిగారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మమత హెలికాప్టర్ దారితప్పిన ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
Read Also : వెంటనే అందరికీ చెప్పండి : హైదరాబాద్ నుంచి ఏపీకి మూడు ప్రత్యేక రైళ్లు