Mamata Bannerjee : దీదీ కాలినొప్పి తగ్గిపోయిందా ? వీడియో వైరల్

మమత బెనర్జీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది...

Mamata Bannerjee : దీదీ కాలినొప్పి తగ్గిపోయిందా ? వీడియో వైరల్

Mamata Banerjee

Updated On : April 4, 2021 / 2:11 PM IST

Bengal Elections 2021 : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ, సీఎం మమతా బెనర్జీకి చెక్ పెట్టాలని కాషాయదళం..ఇలా..రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. అధికారపక్షం, బీజేపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో..ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా..సీఎం మమత బెనర్జీకి గాయాలు కావడం చర్చనీయాంశమైంది. కాలికి పెద్ద బ్యాండెజ్ కట్టారు.

దీంతో ఆమె కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉన్న ఈమె..వీల్ ఛైర్ లోనే ప్రచారం చేపడుతూ ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. నొప్పి పెడుతున్నా..ప్రచారంలో దూసుకపోతున్నారు. ఇదంతా…అలా ఉంచితే…మమత బెనర్జీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వీల్ ఛైర్ లో కూర్చొన్న ఆమె…గాయమైన కాలిని ఊపుతూ కనిపించారు. పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. రెండు కాళ్లను ముందుకు వెనక్కు ఆడించారు. ఓ కాలిని మరో కాలిపై వేసుకుని మరీ కూర్చొవడం పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. Ashoke Pandit ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.