Mamata Meets PM Modi : మోదీని కలిసిన దీదీ..బెంగాల్ పేరు మార్చాలని వినతి

 ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.

Mamata Meets PM Modi : మోదీని కలిసిన దీదీ..బెంగాల్ పేరు మార్చాలని వినతి

Modi Mamata 3

Updated On : July 27, 2021 / 6:01 PM IST

Mamata Meets PM Modi  ఢిల్లీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. వివిధ అంశాలపై మోదీతో మమత చర్చించారు.

ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మమత మాట్లాడుతూ..బెంగాల్ కి మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్ లను కేటాయించాలని ప్రధానిని కోరాను. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమే. ప్రధానితో మీటింగ్ సమయంలో కోవిడ్ ఇష్యూ,మరిన్ని వ్యాక్సిన్లు మరియు మెడిసిన్స్ అవసరం వంటి ఇష్యూస్ ని లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న బెంగాల్ రాష్ట్ర పేరు మార్పు అంశాన్ని కూడా నేను మీటింగ్ సమయంలో లేవనెత్తాను. ఈ పేరు మార్పు విషయంపై..చూస్తాను అని మోదీ చెప్పారని మమత తెలిపారు.

అయితే పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ దుమారం విషయంపై ఈ సందర్భంగా మమత స్పందిస్తూ..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దీనిపై దర్యాప్తుకి ఆదేశించాలి. పెగాసస్ విషయంపై ప్రధాని మోదీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని మమత తెలిపారు.

కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత మమత తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారమే ఢిల్లీకి చేరుకున్న మమత..పలువురు కేంద్ర పెద్దలను,విపక్ష నేతలను కలుస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇవాళ మోదీతో భేటీకి ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్,ఆనంద్ శర్మలని మమత కలిశారు. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మమత కలవనున్నట్లు సమాచారం.