Bihar : రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన కుర్రాడు అరెస్ట్ .. జీవితాలు పణంగా పెట్టొదంటూ RPF ట్వీట్

పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Bihar : రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన కుర్రాడు అరెస్ట్ .. జీవితాలు పణంగా పెట్టొదంటూ RPF ట్వీట్

Bihar

Updated On : July 13, 2023 / 2:46 PM IST

Bihar : సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని చాలామంది చేసే విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. పబ్లిక్ ప్లేస్‌లు, రైల్వే స్టేషన్లు ఎక్కడపడితే అక్కడ వీడియోలు చేస్తూ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్న వారిని చూస్తున్నాం. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో, రైళ్లలో వీడియోలు, రీల్స్ నిషేధం అని అధికారులు మొత్తుకుంటున్న యువత చెవికెక్కడం లేదు. బీహార్ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేస్తూ ఫీట్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Woman Killed : బీహార్ లో మహిళ దారుణ హత్య… కనుగుడ్లు పెకిలించి, నాలుక కోసి, ప్రైవేట్ భాగాలు ఛిద్రం

బీహార్ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ట్రైన్ ఆగి ఉంది. ఓ యువకుడు సడెన్‌గా పిల్లిమొగ్గలు వేయడం మొదలుపెట్టాడు. అతని విన్యాసాన్ని చూస్తూ ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేసింది. ‘మాన్‌పూర్ జంక్షన్‌లో ఓ యువకుడు వైరల్ అవ్వాలని విన్యాసాలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్ల కోసం తమ జీవితాలను పణంగా పెట్టే ఇలాంటి వారికి ఇది ఒక గుణపాఠంగా మేము ఆశిస్తున్నాము’ అనే క్యాప్షన్‌తో దీనిని షేర్ చేశారు.

Police Complaint on Slippers theft : నా చెప్పులు ఎవరో కొట్టేశారు సార్ అంటూ పోలీసులకు ఫిర్యాదు .. ఏపీలో కాదండీ బాబూ

ఈ ట్వీట్ నెటిజన్ల మధ్య చర్చకు దారి తీసింది. ఈ స్టంట్‌కు పెద్దగా ఎవరూ మద్దతు ఇవ్వకపోయినా అతనిని అరెస్టు చేయడం కఠినమైన చర్య అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అతనికి వార్నింగ్.. లేదా కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాల్సిందని కామెంట్ చేశారు. మరికొంతమంది అతనిపై తీసుకున్న చర్యను సమర్ధించారు. పోలీసులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇలాంటి చర్యలకు చెక్ పెట్టగలరని చాలామంది అంటున్నారు.