Mumbai to Dubai : విమానంలో 360 సీట్లు..ఒకే ఒక్కడు ప్రయాణం
బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు.

360 Seater Flight
Emirates Flight : బోయింగ్ 777 విమానం..360 సీట్లు ఉన్నాయి..ముంబై నుంచి దుబాయ్ కి వెళుతోంది. విమానం ఎక్కాడు. విమానంలో ఉన్న సీట్లలో ఎవరూ లేరు. అతనికి ఆశ్చర్యం వేసింది. విమానంలో ఉన్న సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు. ఎన్నోసార్లు విమానంలో ప్రయాణించినా..ఇలా ఎప్పుడు ఎదురు కాలేదు. అసలు విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేశాడు.
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు నిషేధం విధించాయి. భారతీయ ప్రయాణీకులపై యూఏఈ నిషేధం విధించింది. దౌత్య సిబ్బంది, యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు, అరబ్ జాతీయులకు మాత్రం అనుమతినిచ్చారు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిలకు కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ ధృవపత్రం తప్పనిసరి చేసింది. జూన్ 14వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో కొనసాగనున్నాయి. ఈనెల 19వ తేదీ దుబాయ్ నుంచి ముంబైకి బోయింగ్ 777 విమానం వచ్చింది.
దుబాయ్ కి చెందిన స్టార్ జెమ్స్ సీఈవో భవేష్ జవేరి రూ. 18 వేలు పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. యూఏఈ విధించిన నిబంధనల ప్రకారం..ఆయనకు గోల్డెన్ వీసా ఉంది. ప్రభుత్వం విధించిన అన్నీ అనుమతులు ఉండడంతో అతను ప్రయాణం చేసే అవకాశం దక్కింది. విమానంలో ప్రయాణించేది ఆయన ఒక్కరే. అతడి లక్కీ నెంబర్ 18 అని తెలుసుకున్న విమాన సిబ్బంది అతడిని ఆ సీట్లో కూర్చొబెట్టారు. విమాన కమాండర్ వచ్చి జవేరిని అభినందించి వెళ్లాడు. తాను ఎన్నోసార్లు ప్రయాణించినట్లు నేటి అనుభూతి మాత్రం మాటల్లో వర్ణించలేనిదని చెప్పుకొచ్చాడు.
Read More : Suhana Khan : బొమ్మరిల్లు ఫాదర్‌లా కూతురి బాయ్‌ఫ్రెండ్స్ కోసం కింగ్ ఖాన్ కండీషన్స్…