Car Fire : తిట్టాడని కారుకు నిప్పెట్టాడు!

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణం బంగంగాలోని ఓ అపార్ట్మెంట్‌లో కారు దగ్దమైంది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలికి చేరుకొని కారును పరిశీలించారు.

Car Fire : తిట్టాడని కారుకు నిప్పెట్టాడు!

Car Fire

Updated On : November 10, 2021 / 10:49 AM IST

Car Fire : సోమవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్ పట్టణం బంగంగాలోని ఓ అపార్ట్మెంట్‌లో కారు దగ్దమైంది. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకొని కారును పరిశీలించారు.అనంతరం ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు చుట్టుపక్కల పరిశీలించి ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. కావాలనే ఎవరో నిప్పుపెట్టి ఉంటారని పోలీసులు నిర్దారించారు. అనుకున్నదే తడవుగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

చదవండి : Car Fire Accident : డాక్టర్ ప్రాణం తీసిన ఎలుకలు ….

ఓ వ్యక్తి కారుపై పెట్రోల్ పోసి నిప్పటించాడని గుర్తించిన పోలీసులు అతడు అదే ప్రాంతానికి చెందిన రవి రాజ్‌పుత్ అని నిర్దారణకు వచ్చి అదుపులోకి తీసుకోని విచారించారు. పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు రవి. దీపావళి రోజు తన స్నేహితుడితో కలిసి పటాకులు కాల్చుతుంటే తమను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడారని అందుకే తాను ఇలా చేశానని తెలిపారు. పరుషపదజాలం ఉపయోగించడాన్ని.. అనంతరం తమను బెదిరించాడని అది మనసులో పెట్టుకొని కారుకు నిప్పంటించానని వివరించారు.

చదవండి : Car Fires: జర్నీలో ఉండగానే కారులో మంటలు.. అప్రమత్తతే బ్రతికించింది!