Karnataka: టూషన్‭కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసే యత్నం.. పెళ్లి కాకపోతే మరీ ఇలా ప్రవర్తించాలా?

అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Karnataka: టూషన్‭కు వెళ్తున్న బాలికను కిడ్నాప్ చేసే యత్నం.. పెళ్లి కాకపోతే మరీ ఇలా ప్రవర్తించాలా?

Updated On : July 13, 2023 / 8:13 PM IST

Belagavi: ఒక ప్రబుద్ధుడు పెళ్లి కావడం లేదని దారుణానికి ఒడిగట్టాడు. టూషన్‭కు వెళుతున్న పాఠశాల బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆ అమ్మాయి.. అతడిని వదిలించుకోవడంతో, ప్రయత్నం విఫలమై అక్కడి నుంచి ఉడాయించాడు. కర్ణాటక రాష్ట్రంలోని బెలగావిలో జరిగిందీ ఘటన. అయితే ఈ ఘటన అక్కడి వీధిలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

PM Modi France visit: ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఆ దేశ ప్రధాని

ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో.. ఆ వ్యక్తి బాలికను తన భుజాలపై ఎత్తుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బాలిక అతడిని ప్రతిఘటించింది. తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అతడి చేతుల్లో నుంచి బయటపడేందుకు మెలికలు తిరిగింది. దీంతో కిడ్నాప్ సాధ్యం కాదనునుకున్న ఆ దుర్మార్గుడు.. బాలికను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అనంతరం బాలిక అరుపులు విని, నివాసితులు బయటకు వచ్చారు. అప్పటికే అతడు బాలికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ సంఘటన కర్ణాటకలోని బెలగావిలోని హింద్వాడీ పోస్టాఫీసు సమీపంలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నార్త్ జోన్ ఐజీపీ వికాస్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘తిలకవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేశాం. మేము ఇప్పటికే ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. నిందితుల కోసం వెతుకుతున్నాము’’ అని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఇలాంటి ఘటనలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తారని ఆయన అన్నారు.