Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి వింత ప్రవర్తన.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు.. వీడియో వైరల్
ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రెడ్డిట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

delhi metro
Dance in Metro : మెట్రోలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన కొందరు ప్రయాణికుల్లో మార్పురావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ముఖ్యంగా ఇటీవల మెట్రో స్టేషన్లు, రైళ్లలో రీల్స్, వీడియోలు తీయడం పరిపాటిగా మారింది. కొందరైతే రీల్స్ కోసం వింత చేష్టలకుసైతం వెనుకాడటం లేదు. ఢిల్లీ మెట్రో రైలులో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో ఓ వ్యక్తి వింత విన్యాసాలు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైల్ బంపర్ ఆఫర్.. ఇలా రూ.59కే సిటీ అంతా తిరిగేయండి..
ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. రెడ్డిట్‌లో ఇందుకు సంబంధించిన వీడియో షేర్ అయింది. నల్లటి కళ్లద్దాలు ధరించి, తన మొబైల్ ఫోన్‌ను పట్టుకున్న ఒక వ్యక్తి పదేపదే వెనక్కు వంగడం వీడియోలో చూడొచ్చు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటిస్తూ, మెట్రోలో పిల్లర్ చుట్టూ తిరుగుతూ కనిపించాడు. మెట్రోలో ప్రయాణిస్తున్న వారు వ్యక్తి చేసిన వింత చర్యకు ఆశ్చర్యపోయారు. కొంత మంది అతని చేష్టలను సెల్ ఫోన్ల సహాయంతో వీడియో తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను రెడ్డీట్ లో షేర్ చేసిన కొద్దిసేపటికే 2వేల మందికిపైగా వీక్షించారు. 200 మందికిపైగా తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
Hyderabad Metro: గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో రైల్ కోచ్‌లు పెరిగే అవకాశం.. అంతేకాదు..
మెట్రోలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించవద్దని ఇప్పటికే డీఎంఆర్‌సీ హెచ్చరికలుసైతం జారీ చేసింది. మెట్రోలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. డీఎంఆర్సీ ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుచుకొనే వారిపైపట్ల చర్యలు తీసుకొనేందుకు నిత్యం అందుబాటులో ఉంటారని డీఎంఆర్సీ తెలిపింది. అయితే, తాజాగా మెట్రోలో వింతగా ప్రవర్తించిన వ్యక్తి ఎవరు, ఎక్కడి వ్యక్తి అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.