కాంగ్రెస్ ఆఫర్ తిప్పికొట్టిన మన్మోహన్ సింగ్
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంజాబ్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు అక్కడ నుంచి పోటీ చేయాలని కోరిందట.

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంజాబ్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు అక్కడ నుంచి పోటీ చేయాలని కోరిందట.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంజాబ్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ నేతలు అక్కడ నుంచి పోటీ చేయాలని కోరిందట. అమృతసర్ నియోజకవర్గం నుంచి అభ్యర్థించిందట. స్వర్ణ దేవాలయం ఉన్న చోట సిక్కుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని గ్రహించిన కాంగ్రెస్ వ్యూహాలకు షాక్ ఇచ్చారు మన్మోహన్. ఇలా పంజాబ్ లో పోటీ చేయడానికి మన్మోహన్ నిరాకరించడం తొలిసారేం కాదు. 2009 ఎన్నికలలోనూ అనారోగ్యం కారణంగా పోటీ చేయనంటూ అప్పుడే నిరాకరించారు.
Read Also : నోరు విప్పిన RBI : నోట్ల రద్దు వద్దంటే.. ప్రజా శ్రేయస్సు అన్నారు
ఆ తర్వాత 2014లోనూ నిరాకరించగా కాంగ్రెస్ కెప్టెన్ అమరేందర్ సింగ్‌ను నిలబెట్టి విజయం సాధించింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అదే సీటు కోసం పోటీ చేసి ఓడిపోయారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి అస్సాం రాజ్య సభ సభ్యునిగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదు. 1999లో 7 పార్లమెంటరీ స్థానాలున్న ఢిల్లీ నుంచి పోటీ చేసి బీజేపీ వీకే మల్హోత్రా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్.. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో అస్సాం నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేరు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి