Separate Muslim Nation: ప్రత్యేక ముస్లిం దేశం డిమాండ్ చేస్తామంటూ మౌలానా తౌకీర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీరియస్‌గా తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Separate Muslim Nation: ప్రత్యేక ముస్లిం దేశం డిమాండ్ చేస్తామంటూ మౌలానా తౌకీర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Maulana Tauqeer controversial comments that ‘separate Muslim nation’

Updated On : March 12, 2023 / 5:25 PM IST

Separate Muslim Nation: ‘హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం సరైందే అయితే, ఖలిస్తాన్ డిమాండ్ కూడా సరైందే. అలాగే రేపు ముస్లిం రాష్ట్రం కావాలని కూడా డిమాండ్ వస్తుంది’.. ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి. శనివారం మొరాదాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారిని వ్యతిరేకించారు. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం సరైనదే అయితే, ఖలిస్తాన్ డిమాండ్ చేసేవారు కూడా సమర్థించబడతారని అన్నారు. ఇదే కొనసాగింపులో రేపు ముస్లిం యువత ప్రత్యేక ఇస్లాం దేశాన్ని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు ఏమి జరుగుతుందంటూ ఆయన ప్రశ్నించారు.

Same-Sex Marriage: స్వలింగ సంపర్క వివాహాన్ని వ్యతిరేకించిన కేంద్రం.. సుప్రీంకు అఫిడవిట్

మన దేశ విభజనను మరోమారు కోరకోవడం లేదని, కానీ లౌకిక విలువల మీద ఏర్పడ్డ దేశం, వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని మౌలానా తౌకీర్ అన్నారు. ‘‘ఖలిస్తాన్ డిమాండ్ చేస్తున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, అతను హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసే వారిపై దేశద్రోహం కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలి. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడంపై ఎటువంటి చర్య తీసుకోనప్పుడు, ఖలిస్తాన్ డిమాండ్ చేయడం కూడా న్యాయమేనని పరిగణించబడుతుంది’’ అని అన్నారు.

MP Dharmapuri Arvind : కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను-బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

ఇక ప్రధాని నరేంద్ర మోదీ పేరును తౌకీర్ రజా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సీరియస్‌గా తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Bangalore Auto Driver: హిందీ-కన్నడ గొడవ.. ‘నార్త్ ఇండియన్ బిచ్చగాళ్లు’ అంటూ తిట్టిన ఆటో డ్రైవర్

10 లక్షల ముస్లిం బాలికలను అపహరించి మతం మార్చారు
హిందూ మహిళల్ని ముస్లింలుగా మారుస్తున్నారంటూ దేశంలో కొనసాగుతున్న విస్తృత చర్చ నడుమ.. ముస్లిం బాలికల్ని అపహరించి మతం మారుస్తున్నారంటూ తౌకీర్ ఆరోపించడం గమనార్హం. ఇప్పటికే సుమారు పది లక్షల మంది ముస్లిం బాలికల్ని కిడ్నాప్ చేసి మతం మార్చారని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తాము సహించబోమన్నారు. ‘‘హిందూ సంస్థలు సుమారు 10 లక్షల మంది ముస్లిం బాలికలను అపహరించి, బెదిరించి, ప్రలోభపెట్టి, హిందూ మతంలోకి మార్చారు. ఘర్ వాప్సీ అనే పేరుతో వారిని హిందూ అబ్బాయిలు పెళ్లిళ్లు చేసుకున్నారు’’ అని ఏదో సర్వే వెల్లడించినట్లు మౌలానా తౌకీర్ పేర్కొన్నారు.