అహ్మద్ పటేల్ మృతికి మోడీ, రాహుల్ సంతాపం

  • Published By: madhu ,Published On : November 25, 2020 / 08:00 AM IST
అహ్మద్ పటేల్ మృతికి మోడీ, రాహుల్ సంతాపం

Updated On : November 25, 2020 / 10:43 AM IST

Ahmed Patel’s death : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మరణం బాధ కలిగించిందని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో ఆయన పాత్ర ఎప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. అహ్మద్ పటేల్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.



అహ్మద్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మూలస్థంభమని, కష్ట సమయాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారని కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ వెల్లడించారు.
అహ్మద్ పటేల్ మృతికి కాంగ్రెస్ నేత రణదీప్ నూర్జేవాలా సంతాపం తెలిపారు. ఎల్లప్పుడు విధేయతగా విధిని నిర్వర్తించారని, పార్టీని ఎప్పుడూ కుటుంబంగా భావించేవారన్నారు. ప్రత్యర్థులు సైతం అహ్మద్ భయ్ అంటూ గౌరవించే వారన్నారు.



https://10tv.in/senior-congress-leader-ahmed-patel-dies-due-to-multiple-organ-failure/
కాంగ్రెస్ కురువృద్ధుడు, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కరోనా వ్యాధి బారిన పడి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచారు. శరీరంలో అనేక అవయవాలు చికిత్సకు సహకరించకపోవడం వల్లే తెల్లవారుజామున మూడున్నర గంటలకు తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్‌లో వెల్లడించారు.



అక్టోబర్ 1న కరోనా సోకినట్లు తేలడంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. కరోనా ఎంతకూ తగ్గకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన గుర్గావ్‌లోని వేదాంత ఆసుపత్రిలోని ఐసీయూలో చేరారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినా… ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదు.



1949 ఆగస్టు 21న జన్మించిన అహ్మద్ పటేల్ 1976లో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. మొత్తం 8 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మూడుసార్లు లోక్‌సభకు, ఐదు సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రెండు దశాబ్దాల పాటు రాజకీయ సలహాదారుగా కూడా సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్‌గా పనిచేశారు.