వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ

భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌లోని టాంక్ ప్రాంతాన్ని శనివారం సందర్శించారు. టాంక్ వేదికగా ప్రసంగించిన పీఎం పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడారు. ఈ దాడి అనంతరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
‘రాజస్థాన్‌లో అలాంటి ఘటనలు జరిగితే మీరు స్పందించరా.. అలాగే కశ్మీర్‌లో జరిగినా స్పందించాలి. కశ్మీరీ ప్రజల కోసం చేస్తున్న పనులే తప్ప కశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నవి కాదు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదం పెరిగిపోతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మానవత్వాన్ని మర్చిపోయి దాడులకు పాల్పడే వాళ్లనే టార్గెట్ గా చేసుకుని పోరాడుతున్నాం.
Read Also: కాంగ్రెస్ గో బ్యాక్: బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ
ఇన్నాళ్లుగా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. గతేడాది అమర్‌నాథ్ తీర్థ యాత్రికులపై ఉగ్రదాడి జరిపారు. అప్పుడు కశ్మీరీ ముస్లింలు రక్తదానం చేసి ఎంతోమందిని ఆదుకున్నారు. నా దేశంలో ఎవ్వరూ దేశ వ్యతిరేక పనులు చేయడానికి పూనుకోరు. దేశంపై జరిపిన ఉగ్రదాడులను చూస్తూ ఊరుకోం. మనకు తెలిసిన పద్ధతిలో సమాధానం ఇస్తాం.
Read Also: గోల్కోండ సింహం : బద్దం బాల్ రెడ్డి కన్నుమూత