Modi : మోదీ సూట్.. గిన్నిస్ బుక్ రికార్డు, ఇప్పుడు ఇక్కెడుందో తెలుసా
ఓ ఫ్యాక్టరీలో అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో ఆ సూట్ ను ఉంచారు.

Modi
Modi Suit Guinness : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే సంగతి తెలిసిందే. ఆయన ధరిస్తున్న వస్త్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. సందర్భానికి తగిన వస్త్రధారణతో ముందుకొస్తుంటారు. 2015 సంవత్సరంలో ఆయన వేసుకున్న సూట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘మోదీ సూట్’ గా వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూట్ గా గిన్నీస్ బుక్ పుస్తకంలో నమోదైంది. రూ. 4.31 కోట్లకు ఓ వజ్రాల వ్యాపారి దీనిని కొనుక్కొన్నాడు.
Read More : PM Modi: ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఇప్పుడా ఆ సూట్ అత్యంత భద్రంగా దాచిపెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో ఈ సూట్ ను భద్రంగా పెట్టారు. లాల్జీ పటేల్ దీనిని కొనుగోలు చేసి ఓ ఫ్యాక్టరీలో అత్యంత సురక్షితమైన, అత్యాధునిక సాంకేతికతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో ఆ సూట్ ను ఉంచారు. మోదీ రూపంలో విగ్రహాన్ని తయారు చేసి..దానికి ఈ సూట్ ను తొడిగారు. బుల్లెట్ ప్రూఫ్ బాక్స్ లో దీనిని భద్రపరిచారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ఒబామా వచ్చినప్పుడు తీసిన ఫొటోల్లో మోదీ ఎలా ఉన్నారో..అదే విధంగా..ఈ విగ్రహాన్ని రూపొందించడం విశేషం. సూట్ ను కొనుగోలు చేసిన తర్వాత..దానిని అత్యంత జాగ్రత్తగా కాపాడేందుకు…ప్రత్యేక ఏర్పాట్లు చేశామని లాల్జీ భాయ్ వెల్లడించారు. ఈ సూట్ ను ఏడాదికి రెండుసార్లు శుభ్రం చేయడం జరుగుతుందని, తన ఇంట్లో ఉన్న పనివారే జాగ్రత్తగా ఈ పని చేస్తారంటున్నారు.
Read More : TTD : శ్రీవారి లడ్డూ కవర్‌లో వృక్ష ప్రసాదం, మట్టి కుండీలో పెట్టి నీళ్లు పోస్తే
2015 గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన బరాక్ ఒబామాకు భారత్ ఘనమైన అతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆకర్షణీయమైన సూట్ ధరించారు. ఈ సూట్ ను సూరత్ నగరంలో సైన్స్ కన్వెన్షన్ సెంటర్ లో వేలం వేశారు. గుజరాత్ లో ప్రముఖ వజ్రాల వ్యాపారి హితేష్ లాల్జీ భాయ్ పటేల్ రూ. 4.31 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఈ వేలం పాటలో 11 మంది పాల్గొన్నారు. దీంతో అత్యంత ఖరీదైన సూట్ గా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది.