Maharashtra Corona Cases : మహారాష్ట్రలో కొత్తగా 53 వేలకుపైగా కరోనా కేసులు, 864 మంది మృతి
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజూ 50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

Maharashtra Corona Cases
corona new cases in Maharashtra : మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజూ 50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారినపడి 864 మంది మరణించారు.
కరోనా నుంచి కోలుకుని 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోనే 2,678 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ ఒక్కరోజే 62 మంది చనిపోయారు.
రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50,53,336కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 43,47,592కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 75,277గా ఉంది.