కోడలికి 101 రకాల వంటకాలతో విందు

ఆ మహిళకు వివాహమైంది. అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్త ఇచ్చిన ట్రీట్ కు ఆ కోడలు షాక్ అయ్యింది. ఇలా కూడా ఉంటారా ? అని ఆశ్చర్యపోయింది. ఆమె ఇచ్చిన విందుకు నోరెళ్లబెట్టింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 101 రకాల ఫుడ్స్ పెట్టిన ఆ అత్త..వార్తల్లో నిలిచింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో మూండ్రువవడిలో అబుల్ హసన్ నివాసం ఉంటున్నారు. ఇటీవలే సమీప ప్రాంతానికి చెందిన షబ్నాతో 2020, జులై 09వ తేదీన వివాహం జరిగింది. ఘనంగా వివాహం జరిగిన అనంతరం షబ్నా తల్లిదండ్రులు అత్తారింటికి పంపారు.
ఆ సమయంలో ఇంటికి వచ్చిన హసన్ తల్లి అహిలా..కోడలికి ఘనంగా విందు ఏర్పాటు చేయాలని అనుకుంది. అనుకున్నట్లుగానే..భారీ ఆహార పదార్థలు తయారు చేసింది. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, మటన్, చికెన్,. చేపలు, కోడిగుడ్లు, పులిహోరా, పెరుగన్నం, పిండి పదార్థాలు, స్వీట్..ఇలా 101 రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి వడ్డించింది.
పెద్ద పెద్ద ఆకులు పెట్టి..అందులో ఆ ఫుడ్స్ ఐటమ్స్ వడ్డించింది. వెల్ కమ్ కోడలా..అంటూ అహిలా ఆహ్వానం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.