ఒక్క విందు ఎంత పని చేసింది…26 వేల మంది క్వారంటైన్

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 12:38 AM IST
ఒక్క విందు ఎంత పని చేసింది…26 వేల మంది క్వారంటైన్

Updated On : April 6, 2020 / 12:38 AM IST

ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తొలుత 1500 మందిని క్వారంటైన్ కు తరలించగా..తాజాగా ఈ సంఖ్య 26వేల మందికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.

విందుకు ఎవరెవరు హాజరయ్యారు ? వీరితో సన్నిహితంగా మెలిగారు ? అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. వారి కుటుంబసభ్యులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారు దాదాపు 26 వేల మంది అని అధికారులు నిర్ధారించి..వీరందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. (భారత్ లో 3577కి పెరిగిన కరోనా కేసులు… 83 మంది మృతి )

అసలు ఏం జరిగింది ? 
మురేనా నగరానికి చెందిన ఓ వ్యక్తి దుబాయిలో ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేసేవాడు. ఇతని తల్లి చనిపోయింది. దీంతో 2020, మార్చి 17వ తేదీన స్వస్థలానికి వచ్చాడు. తల్లి మృతికి సంతాపంగా అందరికీ విందు ఇవ్వాలని అనుకున్నాడు. అదే నెల 20వ తేదీన విందు ఏర్పాటు చేశాడు. సన్నిహితులు, బంధువులు అందరూ హాజరయ్యారు. ఈ సమయంలోనే కరోనా రాకాసి కోరలు చాస్తోంది.

కానీ..ఇక్కడ ప్రయాణానికి సంబంధించిన విషయాలు అధికారులకు తెలియచేయలేదు. ఈ క్రమంలో ఆ వ్యక్తి..భార్య..అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి వెళ్లగా..కరోనా లక్షణాలు కనిపించాయి. వైద్యాధికారులు ఆరా తీశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. దంపతులిద్దరూ ఏప్రిల్ 02వ తేదీన కరోనా పాజిటివ్ గా తేల్చారు. విందుకు హాజరైన వారందరికి పరీక్షలు చేసి క్వారంటైన్ కు తరలించారు.