మోడీ, షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో పిటిషన్

ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రచారంలో వీరిద్దరూ సైనిక బలగాలు వాడుకున్నారని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. దీనిపై విచారించి.. ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఈ విషయంలో ఎన్నికల సంఘానికి కంప్లయింట్ చేసినా పట్టించుకోవటం లేదని పిటిషన్‌లో సుస్మితా ఆరోపించారు. 48 నుంచి 72 గంటలు ప్రచారం నిర్వహించి.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నారు. ఈమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం విచారించనుంది సుప్రీంకోర్టు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘిస్తున్న నేతలపై ఆంక్షలు విధించింది ఈసీ.
* ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
* 9 రాష్ట్రాల్లో 71 లోక్‌సభ స్థానాలకు పోలింగ్
* ఈ విడతలో 961మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
* ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
* మహారాష్ట్ర-17, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13..
* పశ్చిమ బెంగాల్-8, మధ్యప్రదేశ్-6, ఒడిషా-6..
* బీహార్-5, జార్ఖండ్-3, జమ్మూ కాశ్మీర్-1లోక్‌సభ స్థానాల్లో పోలింగ్.
* ఒడిశాలో 6 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్.
* ఓటుహక్కు వినియోగించుకోనున్న 12.79 కోట్లమంది ప్రజలు.