‘mPassport Seva’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ ఎలా?

  • Published By: veegamteam ,Published On : March 3, 2020 / 10:48 AM IST
‘mPassport Seva’ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ ఎలా?

Updated On : March 3, 2020 / 10:48 AM IST

పాస్‌పోర్టు కోసం కేంద్రాల చుట్టూ తిరిగి అలసిపోతున్నారా? ఇకపై మీకు ఆ కష్టాలు ఉండవు. ఎందుకంటే.. పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డైరెక్ట్ గా మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ పాస్ పోర్ట్ సేవా యాప్‌తో దేశంలో ఎక్క‌డి నుంచైనా పాస్‌పోర్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం:
*  mPassport Seva యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
* New user registration పైన ట్యాప్ చేయండి.
* పాస్ పోర్ట్ ఆఫీస్‌ ను సెల‌క్ట్ చేసుకుని పేరు, పుట్టిన తేదీ వివ‌రాలు, ఈ-మెయిల్ ఐడీ, కాంటాక్ట్ డీటెయిల్స్ నింపండి.
* యునిక్ లాగిన్ ఐడీని ఎంట‌ర్ చేయండి. ఇది మీ ఈ-మెయిల్ ఐడీ లానే ఉంటుంది.  
* ఒకవేల మీరు పాస్ వ‌ర్డ్ మ‌రిచిపోతే రిక‌వ‌రీ చేయ‌డానికి సెక్యూరిటీ ప్ర‌శ్న‌, స‌మాధానాల‌ను నింపండి.
* క్యాప్చా ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ చేయండి. అనంతరం మీకు పాస్‌పోర్టు ఆఫీసు నుంచి ఈ-మెయిల్ వ‌స్తుంది. దానిలో ఉన్న వెరిఫికేష‌న్ లింక్‌ను క్లిక్ చేయండి. 
* లింక్ క్లిక్ చేయగానే, ఒక వెబ్ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. కన్ఫర్మేషన్ కోసం లాగిన్ ఐడీని ఎంటర్ చేయండి. 
* యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే.. Existing User Login వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ ఐడీ, పాస్ వ‌ర్డ్ ఎంట‌ర్ చేస్తే యాప్లోకి ఎంటరవుతారు.
* పేమెంట్ ఆప్షన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. తర్వాత పాస్‌పోర్ట్ సెంటర్‌కు వెళ్లి డాక్యుమెంట్స్ వెరిఫై చేయించుకోవడానికి మీరే ఓ టైమ్ స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది.

పాస్‌పోర్ట్‌ గురించి ఏమైనా అభ్యంతరాలుంటే సలహాల కోసం  1800 258 1800 నెంబర్ కు కాల్ చేయచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉదయం 8గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.