కదిలే బస్సు నుంచి దూకి గొలుసు దొంగను పట్టుకున్న యువతి

కదిలే బస్సు నుంచి దూకి గొలుసు దొంగను పట్టుకున్న యువతి

Updated On : November 3, 2020 / 12:26 PM IST

Chain Snatcher: చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు కదిలే బస్సులో నుంచి దూకేసింది ఓ యువతి. ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో పట్టుకోగలిగింది. గురువారం రూ.40వేల విలువైన బంగారపు గొలుసు దొంగిలించి పరారీ అవుతున్న దొంగను పట్టుకున్నారు.

డబుల్ డెక్కర్ లో ప్రయాణిస్తున్న సంజనా బాగల్ అనే యువతి గుంపులో నుంచి తన గొలుసు ఎవరో లాక్కుంటున్నారని గమనించింది. ముకేశ్ గైక్వాడ్(34)వ్యక్తి గొలుసు దొంగిలించి కదిలే బస్సునుంచి దిగి అంధేరీ కుర్లా రోడ్ లో ఉదయం పది గంటల సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.



ప్రైవేట్ కంపెనీలో టెలికాలర్ గా పనిచేస్తున్న బాగల్ చైన్ ను తిరిగి ఇవ్వగలిగాం. ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ‘ఆ సమయంలో బస్సు కదులుతూ ఉంది. దొంగ చైన్ దొంగిలించి పారిపోతున్నట్లుగా గమనించి పట్టుకోవాలనుకున్నా. నా కష్టార్జితంతో కొనుక్కున్న చైన్ అది’ అని బాగల్ చెప్పింది.

ఉదయం 9గంటల 45నిమిషాల సమయంలో బస్సులో కిక్కిరిసిపోయి ఉన్నారు. గైక్వాడ్ ప్లాన్ ప్రకారం ఫాలో అయి చైన్ లాక్కున్నాడు. ఆమె ఏదో జరుగుతుందని పసిగట్టి వెనక్కు తిరిగే లోపే చైన్ పోయిందని తెలిసింది. కదిలే బస్సులో నుంచి దిగిపోతున్న వ్యక్తిని చూసి దొంగ అని కన్ఫామ్ చేసుకుని దిగిపోయింది.

అతణ్ని ఫాలో చేస్తూ.. అరుచుకుంటూ రోడ్ పై ఉన్నవారందరినీ అలర్ట్ చేసింది. చకాలా సిగ్నల్ దగ్గర డ్యూట్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో ఆటోలో పరారీ అవుతున్న దొంగను ట్రాఫిక్ లో పట్టుకోగలిగారు’ అని అంధేరీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. నిరుద్యోగి అయిన గైక్వాడ్ దొంగతనం చేశాడని మరింత విచారణ నిమిత్తం అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.