Gyanvapi mosque : జ్ఞానవాపి కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు సంబరాలు .. శివలింగానికి హారతి ఇచ్చి పూజలు

మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు బ్యాండు మోగించి సంబరాలు చేసుకున్నారు శివలింగానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. మా మద్దతు హిందువులకే అని ప్రకటించారు.

Gyanvapi mosque : జ్ఞానవాపి కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు సంబరాలు .. శివలింగానికి హారతి ఇచ్చి పూజలు

muslim women celebrate on the courts decision in the gyanvapi case..

Updated On : September 14, 2022 / 10:14 AM IST

muslim womens prayers at Gyanvapi mosque : మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసు విషయం ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ క్రమంలో జ్ఞానవాపి మసీదు బయట గోడలపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు జిల్లా కోర్టు అనుమతించిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో వారణాసి మతసామరస్యానికి వేదికగా నిలిచింది. వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో హిందువులకు స్థానిక ముస్లిం మహిళలు మద్దతు పలికారు. బ్యాండు మోగిస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు..వారణాసిలోని లాంహిలోని సుభాష్ భవన్‌లో భోలేనాథ్ స్వామికి హారతి ఇచ్చి మతసామరస్యాన్ని చాటుకున్నారు.

శృంగేరి గౌరీదేవి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న జ్ఞానవాపి మసీదు బయట గోడలపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకోవటానికి జిల్లా కోర్టు అనుమతించిన మరునాడే ముస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వరంలో కొందరు మహిళలు శివలింగానికి హారతి ఇవ్వడం ఆసక్తికని కలిగిస్తోంది. లివలింగానికి పూజలు చేసిన తరువాత ముస్లిం మహిళలు మాట్లాడుతూ..ఈ వివాదంలో తమ మద్దతు హిందువులకేనని స్పష్టం చేస్తూ ప్రకటించారు.

ముస్లిం మహిళా ఫౌండేషన్ అధ్యక్షురాలు నజ్నీన్ అన్సారీ నేతృత్వంలో ముస్లిం మహిళలు ఓం నమఃశివాయ్‌తో హారతి నిర్వహించి ద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యాప్తి చేయనివ్వబోమని నినదించారు. కాశీలోని గంగ జముని తహజీబ్‌ను నాశనం చేయనివ్వదన్నారు నజ్నీన్ అన్సారీ. మా పూర్వీకులు హిందువులుగా ఉన్నప్పుడు..వారు ఆది విశ్వేశ్వరుడిని పూజించేవారని తెలిపారు. కోర్టు తీర్పును మేమంతా గౌరవిస్తాం అని స్పష్టంచేశారు. చరిత్రకారుడు మరియు విశాల్ భారత్ సంస్థాన్ అధిపతి డాక్టర్ రాజీవ్ శ్రీవాస్తవ మసీర్-ఎ-ఆలమ్‌గిరిలో, ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేసిన విషయం గురించి సాకీ ముస్తయిద్ ఖాన్ స్పష్టంగా రాశారని చెప్పారు. దీనికి క్రీ.శ.1710లో రచించిన గ్రంథమే అతిపెద్ద రుజువు అని అన్నారు.

మరోవైపు జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని అంజుమాన్ ఇంతే జామియా కమిటీ తెలిపింది. దీని కోసం సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా వారి అంజుమాన్ ఇంతే జామియా కమిటీ న్యాయవాది మిరాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో తమకు న్యాయం జరగలేదని..న్యాయం కోసం పైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అలాగే ఈ విషయంపై తాము కూడా కేవియట్ దాఖలు చేస్తామని హిందువుల తరపు న్యాయవాది విషు జైన్ తెలిపారు.