Mysterious ‘moving train’ of lights : ఆకాశంలో వింత వెలుగులు .. ఆశ్చర్యపోయిన యూపీ ప్రజలు .. ఏలియన్స్ పనేనా?

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆకాశంలో వింత వింత వెలుగులు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాత్రి సమయంలో రైలు ప్రయాణిస్తే కనిపిస్తుందే అచ్చంగా అలాగా రైలు ప్రయాణిస్తుంటే బోగీల్లోంచి లైట్లు కనిపించినట్లుగా ఓ వరుసలో వెలుగులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

Mysterious ‘moving train’ of lights : ఆకాశంలో వింత వెలుగులు .. ఆశ్చర్యపోయిన యూపీ ప్రజలు .. ఏలియన్స్ పనేనా?

Mysterious 'moving train' of lights

Updated On : September 14, 2022 / 11:12 AM IST

Mysterious ‘moving train’ of lights : పలు అద్భుతాలకు నెలవు అయిన ఆకాశం మరోసారి ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆకాశంలో వింత వింత వెలుగులు చూసి ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. రాత్రి సమయంలో రైలు ప్రయాణిస్తే కనిపిస్తుందే అచ్చంగా అలాగా.. బోగీల్లోంచి లైట్లు కనిపిస్తాయే అచ్చం అలా ఓ వరుసలో వెలుగులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. యూపీలోని లఖ్‌నవూ, ఫరూఖాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఆకాశంలో వింత వెలుగులు కనిపించి కనువిందు చేశారు. ఆశ్చర్యపరిచాయి. సోమవారం (సెప్టెంబర్ 12,2022) సాయంత్రం 7.30 గంటల సమయంలో వరుసగా కదులుతూ కనిపించిన ఆ వెలుగులను చూసిన ప్రజలు భయపడ్డారు. మరోపక్క ఆశ్చర్యపోయారు.

నక్షత్రాల్లా మెరుస్తూ.. రైలు డబ్బాల ఆకారంలో పొడుగ్గా ఉన్న వాటిని చూసిన అవాక్కయ్యారు. ఆకాశంలో అద్భుతమేమైనా జరుగుతుందా?లేదా ఏమన్నా ప్రమాదం సంభవించబోతోందా? అని భయాందోళనలకు గురయ్యారు. పలువురు ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో యూపీలో కనిపించిన ఆవింత వెలుగులు ప్రపంచానికి తెలిసాయి. ఈ వెలుగుల వెనుక గ్రహంతరవాసుల పనేమైనా ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

కాదు కాదు ఇవన్నీ అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌ సంస్థ పంపించిన ఉపగ్రహాలు అయ్యుంటాయని మరికొంతమంది అనుకున్నారు. స్పేస్ఎక్స్‌ సంస్థ ఇటీవలే ఫ్లోరిడా తీరం నుంచి 51 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది.భూమ్మీద మారుమాల ప్రాంతాలకు సైతం బ్రాడ్​బ్యాండ్ సేవలను విస్తరించే లక్ష్యంతో చేపట్టిన స్టార్​లింక్ ప్రాజెక్టు కోసం అనేక ఉపగ్రహాలను స్పేస్ఎక్స్ నింగిలోకి ప్రయోగిస్తోంది.మరి ఈ వెలుగుల వెనుక ఉన్న కారణమేంటో తెలియాల్సి ఉంది.