mukhtar abbas naqvi: మీది ‘ఇండియా ఫోబియా’.. బ్రిటన్ ఎంపీకి భారత్ ఘాటు రిప్లై

ఇండియాలో పెరిగిపోతున్న ‘ఇస్లామోఫోబియా’పై మోదీతో చర్చించాలి అని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సూచించిన బ్రిటన్ ఎంపీకి ఘాటుగా రిప్లై ఇచ్చింది భారత్.

mukhtar abbas naqvi: మీది ‘ఇండియా ఫోబియా’.. బ్రిటన్ ఎంపీకి భారత్ ఘాటు రిప్లై

Mukhtar Abbas Naqvi

mukhtar abbas naqvi: ఇండియాలో పెరిగిపోతున్న ‘ఇస్లామోఫోబియా’పై మోదీతో చర్చించాలి అని కోరుతూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సూచించిన బ్రిటన్ ఎంపీకి ఘాటుగా రిప్లై ఇచ్చింది భారత్. భారత దేశంలో ముస్లింలతోపాటు పౌరులంతా సురక్షితంగా ఉన్నారని, మీకున్న ‘ఇండియా ఫోబియా’ను ‘ఇస్లామో ఫోబియా’గా మార్చుకోవద్దని ఎంపీకి సూచించింది. బ్రిటన్ ప్రధాని మోరిస్ జాన్సన్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో బోరిస్ జాన్సన్ శుక్రవారం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అయితే, ఇండియాతో వ్యాపార, వాణిజ్య, అంతర్జాతీయ అంశాలతోపాటు ‘ఇస్లామోఫోబియా’పై కూడా బోరిస్ జాన్సన్ చర్చించాలని కోరుతూ పాక్ సంతతికి చెందిన బ్రిటన్ మహిళా ఎంపీ నాజ్ షా ట్విట్టర్‌లో సూచించారు.

Boris Johnson India: నేడు ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని భేటీ: రష్యా – యుక్రెయిన్ యుద్ధం, వాణిజ్య అంశాలపై చర్చ

భారత దేశంలో ముస్లింలపై దాడులు, వ్యతిరేకత పెరిగిపోతోందని నాజ్ ట్వీట్ చేశారు. కాశ్మీర్‌లో కూడా మారణహోమం జరుగుతోందన్నారు. అయితే, నాజ్ షా చేసిన ట్వీట్లపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆమెకు ఘాటుగా బదులిచ్చారు. ‘‘భారత దేశంలో ముస్లింలతోపాటు పౌరులంతా సురక్షితంగా ఉన్నారు. మీకున్న ‘ఇండియా ఫోబియా’ను ‘ఇస్లామో ఫోబియా’గా మార్చుకోకండి. అందరూ కలిసి మెలిసి జీవించడమే మా విధానం’’ అంటూ ఆమెకు బదులిచ్చారు.