Uttar Pradesh :పెళ్ళైన మరుసటిరోజే బిడ్డను ప్రసవించిన నవ వధువు

వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు వెల్లడించారు. కాగా, వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా ఉందని వధువు కుటుంబ సభ్యులు తమకు చెప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు.

Uttar Pradesh :పెళ్ళైన మరుసటిరోజే బిడ్డను ప్రసవించిన నవ వధువు

new bride

Updated On : June 30, 2023 / 11:04 AM IST

New Bride gives Birth : ఉత్తరప్రదేశ్ లోని నోయిడా జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన మరుసటిరోజే నవ వధువు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి వరుడి కుటుంబం షాక్ అయ్యింది. గ్రేటర్ నోయిడాలో ఓ వ్యక్తికి సికింద్రాబాద్ కు చెందిన మహిళతో జూన్ 26న వివాహం అయింది. అయితే వివాహం జరిగిన మరుసటిరోజు రాత్రి కడుపులో నొప్పిగా ఉందని నవ వధువు చెప్పారు.

దీంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. నవ వధువును పరిశీలించిన డాక్టర్లు ఆమె 7 నెలల గర్భిణీ అని తెలిపారు. ఈ విషయం తెలిసి వరుడు, అతడి కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. కాగా, ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మహిళ తర్వాత రోజు పాపకు జన్మనిచ్చింది. అయితే, ఆమె గర్భవతి అన్న విషయం తమకు తెలుసని వధువు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Uttar Pradesh Road Accident : ఉత్తరప్రదేశ్ లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం

వరుడు, అతడి కుటుంబానికి ఈ విషయం చెప్పకుండా దాచినట్లు వెల్లడించారు. కాగా, వధువుకు ఇటీవల రాళ్లు తొలగించే సర్జరీ జరిగిందని, దాని వల్ల ఆమె కడుపు ఉబ్బినట్లుగా ఉందని వధువు కుటుంబ సభ్యులు తమకు చెప్పారని వరుడి బంధువులు చెబుతున్నారు. నవ వధువు ఏడు నెలల గర్భిణీ అని డాక్టర్లు చెప్పడంతో తాము షాక్ అయినట్లు పేర్కొన్నారు.

ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నారు. నవ వధువు జన్మనిచ్చిన బిడ్డను వరుడి కుటుంబం నిరాకరించినట్లు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో వారిని తీసుకుని సికింద్రాబాద్ కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ విషయం తమ ద‌ృష్టికి వచ్చినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.