Jio Plans : జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు.. వారికి పండగే, కొత్త ప్లాన్ల పూర్తి వివరాలు

Jio New Data Plans : Jio అనేక రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. ఇది వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. అదనపు డేటాతో ఉంటుంది.

Jio Plans : జియో నుంచి అదిరిపోయే ఆఫర్లు.. వారికి పండగే, కొత్త ప్లాన్ల పూర్తి వివరాలు

Jio New Data Plans (Photo : Google)

Updated On : November 23, 2023 / 8:25 PM IST

దేశంలో లీడింగ్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొస్తోంది. తాజాగా కొత్త, విభిన్నమైన రీచార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో రోజువారీ డేటా కేటాయింపుల పై అదనపు డేటా ఉంటుంది. అధికంగా ఇంటర్నెట్ వాడే వారి కోసం ప్రత్యేకంగా ఈ కొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. బ్రౌజింగ్ లో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు వీలుగా ఈ డేటా ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది.

అదనపు ప్రయోజనాలతో 5GB రోజువారీ డేటాను అందించే ప్లాన్లు..
Jio అనేక రీఛార్జ్ ప్లాన్లతో ముందుకు వచ్చింది. ఇది వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. అదనపు డేటాతో ఉంటుంది. అధిక డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్‌లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

Also Read : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!

రిలయన్స్ జియో నుండి ప్లాన్లు, ఆఫర్ల వివరాలు..

జియో రూ.699 ప్లాన్
డైలీ 5జీబీ డేటా
28 రోజులకు 140 జీబీ
28 రోజుల వాలిడిటీ
జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సర్వీసెస్ కు కాంప్లిమెంటరీ యాక్సెస్

జియో రూ.2099 ప్లాన్
డైలీ 5జీబీ డేటా, 84 రోజులకు
అదనంగా 14 రోజుల వాలిడిటీ
వాలిడిటీ ఉన్నంత కాలం 538జీబీ
అదనంగా 48 జీబీ డేటా
జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ అదనం

Also Read : యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? గూగుల్ పే నుంచి పేటీఎం దాకా రోజుకు ఎంత డబ్బు పంపొచ్చు?

జియో రూ.4199 ప్లాన్
వాలిడిటీ 168 రోజులు
అదనంగా 28 రోజుల వాలిడిటీ
మొత్తం డేటా 1076 జీబీ
రోజూ 5జీబీ డేటా
సబ్ స్క్రైబర్లు ఏ నెట్ వర్క్ కైనా ఉచితంగా కాల్ చేసుకోవచ్చు.