ప్రియుడుతో పెళ్లి కూతురు పరార్.. ‘హమ్మయ్య.. బతికించింది..’ అంటూ పెళ్ళికొడుకు హ్యాపీ
వివాహం జరిగిన నెల రోజులకు నవ వధువు భర్తను వదిలేసి తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. న

uttar pradesh
Uttar pradesh: పెద్దల సాక్షిగా పెళ్లిచేసుకున్న కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య ఘర్షణలతో, అక్రమ సంబంధాల కారణంగా విడిపోవటం వంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇష్టంలేకుండా పెళ్లిచేసుకొని ఆ తరువాత భర్త అడ్డుతొలగించుకునే క్రమంలో భార్యలు క్రూరంగా వ్యవహరిస్తున్నారు. కొందరు వధువులు.. పెళ్లి చేసుకున్న తరువాత ప్రియుడితో కలిసి పారిపోతున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివాహం జరిగిన నెల రోజులకు నవ వధువు భర్తను వదిలేసి తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నవ వధువు ప్రియుడితో వెళ్లిపోతే భర్త, వారి కుటుంబ సభ్యులు బాధతో ఉంటారు.. ఇలా జరిగిందేంటి అంటూ వధువు కుటుంబ సభ్యులను నిలదీస్తారు. కానీ, ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. అంతేకాదు.. భార్య తన ప్రియుడితో వెళ్లిపోయినందుకు భర్త హ్యాపీగా ఫీలయ్యాడు. ఇందుకు ప్రధాన కారణం ఉంది. రాజా రఘువంశీ పరిస్థితి తనకు రాలేదని భర్త, అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్ లోని బుడాన్ జిల్లాలో పెళ్లి జరిగిన నెలరోజులకే నవవధువు భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. 20యేళ్ల యువతితో 23యేళ్ల సునీల్ కు గతనెల మే17న పెళ్లి జరిగింది. అత్తింట్లో తొమ్మిది రోజులు ఉన్న తరువాత ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో ఆమె భర్త తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవ వధువు తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ వచ్చింది. తాను ప్రేమికుడితో కలిసి జీవిస్తానని పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు రెండు కుటుంబాలకు నచ్చజెప్పి వారు విడిపోయేందుకు అవకాశం కల్పించారు.
నవ వధువు ప్రేమికుడితో వెళ్లిపోయేందుకు నిర్ణయించుకోవటంతో వధువు కుటుంబం పెళ్లిలో వచ్చిన బహుమతులను ఆమె కుటుంబానికి అప్పగించింది. ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై చాలా సంతోషం వ్యక్తం చేశాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నానని, నేను బతికిపోయానంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ నేను హనీమూన్ కోసం ఆమెను నైనిటాల్ తీసుకెళ్లాలని అనుకున్నా. కానీ, ఆమె తన ప్రేమికుడితో కలిసి జీవించాలని అనుకుంది. అందుకు నేను సంతోషంగా ఉన్నాను. కనీసం రాజా రఘువంశీ పరిస్థితి నాకు రానందుకు ఆనందంగా ఉంది. ఆమెకు ప్రేమదొరికింది.. నా జీవితం కూడా నాశనం కాలేదు’’ అంటూ సునీల్ పేర్కొన్నాడు.