అమిత్ షాకు రక్తంతో లేఖ: నిర్భయ నిందితులను ఉరితీస్తా

ప్రముఖుల నుంచి మద్దతు కావాలని షూటర్‌ వర్తికా సింగ్‌ కోరుతున్నారు. దానిని అమిత్ షాకు పంపి తీరతానని అంటున్నారు. 

అమిత్ షాకు రక్తంతో లేఖ: నిర్భయ నిందితులను ఉరితీస్తా

Updated On : December 15, 2019 / 1:01 PM IST

ప్రముఖుల నుంచి మద్దతు కావాలని షూటర్‌ వర్తికా సింగ్‌ కోరుతున్నారు. దానిని అమిత్ షాకు పంపి తీరతానని అంటున్నారు. 

తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు త్వరపడుతున్నారు. ఉరి తీసే వ్యక్తి(తలారీ) లేడని తెలియడంతో ఆ స్థానంలో మేం ఆ పనిచేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులకు ముందు చెన్నై పోలీస్, ఉత్తరప్రదేశ్ పోలీసులు తీహార్ జైలుకు ఉత్తరాలు రాశారు. 

ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకే అనుమతి కోరుతూ ఓ మహిళ(క్రీడాకారిణి) లేఖ రాసింది. నిర్భయ నిందితుల ఉరి తీసేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ తన రక్తంతో లేఖ రాసిందట. తన విజ్ఞప్తికి ప్రముఖుల నుంచి మద్దతు కావాలని షూటర్‌ వర్తికా సింగ్‌ కోరుతున్నారు. దానిని అమిత్ షాకు పంపి తీరతానని అంటున్నారు. 

‘నా చేతిలో ఉన్న లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాశాను. నా రక్తంతో రాసిన లేఖ ఇది. నిర్భయ దోషులకు తలారీగా వ్యవహరించే అవకాశం ఇవ్వాలని కోరాను. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతిని బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ఈ లేఖను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపిస్తా. ట్వీట్‌ కూడా చేశా’ అని తెలిపారు. 

వర్తికా సింగ్ గతంలోనూ వార్తల్లో నిలిచింది. బాబ్రీ మసీదు విషయంలో ఇక్బాల్ అన్సారీపై ఆరోపణలు గుప్పించింది. శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితులు ముఖేశ్, అక్షయ్, పవన్, వినయ్.