NITI Aayog: నీతి ఆయోగ్ భేటీకి నితీష్ గైర్హాజర్.. కారణమేమంటే..
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. ఈ సమావేశంను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం సమావేశంకు హాజరు కాకపోవటం చర్చనీయాంశంగా మారింది.

NITI AAYOGS GOVERNING COUNCIL MEETING
NITI Aayog: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ సమావేశం (NITI Aayog Meeting) జరిగింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టి నెంట్ గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, ఎస్ జేశంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముందుగా నిర్ణయించిన ఎజెండాలోని అంశాలపై చర్చించారు.
NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ తో పాటు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం ఈ సమావేశంకు గౌర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. 2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవ్వడం ఇదే తొలిసారి. అయితే ప్రస్తుతం జరిగే సమావేశంకు నితీష్ కుమార్ కావాలనే హాజరు కాలేదా? ఏదైనా కారణం వల్ల హాజరు కాలేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
NITI Aayog meeting: నిధులు, మినహాయింపులు కావాలి: నీతి అయోగ్ సమావేశంలో సీఎంలు
జేడీయూ కేంద్రంలో, బీహార్ లో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామి. ఈ మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీయే కు మద్దతు ఇవ్వడని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ జేడీయూ ఎన్డీయే అభ్యర్థి ముర్ముకే మద్దతు ఇచ్చింది. తాజాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీతి ఆయోగ్ కు నితీష్ హాజరు కాకపోవటం పలు చర్చలకు దారితీసింది. అయితే నితీష్ సమావేశంకు హాజరు కాకపోవటం వెనుక రాజకీయ కారణాలు లేవని, కొన్ని ముఖ్యమైన పనుల వల్ల వెళ్లలేక పోయారన్న వాదన వినిపిస్తోంది.