NLC Recruitment : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం

నవరత్న కంపెనీ ''నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్''' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NLC Recruitment : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం

Nlc Recruitment 2021

Updated On : August 19, 2021 / 5:14 PM IST

NLC Recruitment 2021 : నవరత్న కంపెనీ ”నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్”’ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు విభాగాల్లో 675 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ గా పని చేయాలి. ఆ తర్వాత సంస్థ అవసరాన్ని బట్టి సర్వీసు పొడిగిస్తుంది. సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హతగా నిర్ణయించింది. అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం అకడమిక్ మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. www.nlcindia.in లో దరఖాస్తు చేసుకోవాలి.

* ITI, BCom, BSc, BCA or BBA డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
* అప్లయ్ చేసుకున్న పోస్టు, విద్యార్హతను బట్టి నెలకు రూ. 8,766, రూ. 10,019, రూ. 12,524 స్టైపండ్ గా ఇస్తారు.
* NCVT లేదా DGET నుంచి ఐటీఐ చేసిన వాళ్లు అర్హులు
* 2019, 2020, 2021లో BCom, BSc in computer science, BCA and BBA డిగ్రీ పాస్ అయిన వారు కూడా అర్హులే.

పోస్టు ఖాళీలు
Fitter 90
Turner 35
Mechanic (Motor Vehicle) 95
Electrician 90
Wireman 90
Mechanic (Diesel) 5
Mechanic (Tractor) 5
Carpenter 5
Plumber 5
Stenographer 15
Welder 90
PASAA 30
Accountant 40
Data entry operator 40
Assistant (HR) 40

ఇలా అప్లయ్ చేసుకోండి…
* ఆసక్తి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ ఎల్ సీ అఫిషియల్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి
* 25 ఆగస్టు 2021 (5 PM) లోపు అప్లయ్ చేసుకోవలి.
* అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ ఔట్, సంబంధిత డాక్యుమెంట్లు పోస్టులో ఎన్ ఎల్ సీ కి ఆగస్టు 30లోపు పంపాలి.
* ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు అఫిషియల్ వెబ్ సైట్ ని చూడగలరు.