NMDC Auction Of Panna Daimonds : ఎన్‌ఎండీసీ వజ్రాల వేలం..భారీగా తరలి వచ్చిన వ్యాపారులు

ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది.

NMDC Auction Of Panna Daimonds : ఎన్‌ఎండీసీ వజ్రాల వేలం..భారీగా తరలి వచ్చిన వ్యాపారులు

Nmdc Conducts E Auction Of 8,337 Carats Rough Diamonds From Panna Mines

Updated On : March 11, 2022 / 1:33 PM IST

NMDC Conducts E Auction Of Panna Daimonds : ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ (NMDC) ఇటీవల వజ్రాల వేలం నిర్వహించింది. దీనికి వజ్రాల వ్యాపారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వజ్రాల వేలానికి భారీ స్పందన వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన 8,337 క్యారట్ల రఫ్‌ డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలం (E Auction)లో గుజరాత్ లోని సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొన్నట్లు సంస్థ తెలిపింది. సూరత్ అంటే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే.

2020 డిసెంబర్‌ ముందు వెలికి తీసిన వజ్రాలను ఈ వేలంలో విక్రయించామని NMDC గురువారం (మార్చి 10,2022) వెల్లడింింది.. ఈ వజ్రాల వేలానికి నూటికి నూరు శాతం బిడ్లు వచ్చినట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ సుమీత్‌ దేవ్‌ తెలిపారు. దేశీయంగా 90% మేర వజ్రాల వనరులు మధ్యప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఎన్‌ఎండీసీకి చెందిన పన్నా గనుల్లో ఏటా 84,000 క్యారట్ల డైమండ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. దేశంలో యాంత్రీకరించిన వజ్రాల గని ఇదొక్కటే కావటం విశేషం.

కాగా మధ్యప్రదేశ్ లోని పన్నా గనుల్లో వజ్రాలు దొరికాయనే వార్తలు వింటూనే ఉంటాం. పన్నా అంటే వజ్రాలు, వజ్రాలంటే పన్నా గనులు గుర్తుకొచ్చేంది పేరొందాయి పన్నా గనులు.