Rahul Gandhi: పేదలకు పనికిరాని బడ్జెట్ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది

మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఏస్థాయి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi: పేదలకు పనికిరాని బడ్జెట్ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది

Rahul

Updated On : February 1, 2022 / 4:36 PM IST

Rahul Gandhi on Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో జీతాలు, మధ్యతరగతి, పేద, రైతులు, యువత, చిన్న వ్యాపారులకు మేలు జరగలేదని అన్నారు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ. మోదీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఏ తరగతి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.

“M0di G0vernment’s Zer0 Sum Budget!” అంటూ ఎద్దేవా చేస్తూ.. నెల నెలా జీతాలు తీసుకునే తరగతి ప్రజలు, మధ్య తరగతి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, రైతులు, చిన్నవ్యాపారస్థుల(MSME)కు ఏమీ ఒరగలేదని అన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌పై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఈ ఏడాది బడ్జెట్‌ కేవలం ధనికుల కోసమేనని, అందులో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. బడ్జెట్‌లో ప్రభుత్వం కార్పొరేట్ పన్నును మాత్రమే తగ్గించిందని, ఇది ధనికుల బడ్జెట్‌యేనని అభిప్రాయపడ్డారు.