Scrub Typhus: కొవిడ్ పోయింది.. మరొకటి వచ్చింది! మహమ్మారిలా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫన్ వైరస్

స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం

Scrub Typhus: కొవిడ్ పోయింది.. మరొకటి వచ్చింది! మహమ్మారిలా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫన్ వైరస్

Updated On : October 6, 2023 / 3:38 PM IST

Scrub Typhus: కొవిడ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ వైరస్ కారణంగా ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. కొద్ది రోజుల క్రితమే కొవిడ్ పీడ దాదాపుగా పోయింది. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి ఆలోచనలు మళ్లుతున్నాయి. అంతలోనే మరో వైరస్ వణికిస్తోంది. తాజాగా స్క్రబ్ టైఫన్ అనే వైరస్ మహమ్మారిలా వ్యాపిస్తోంది. ప్రస్తుతం దీని ప్రభావం ఒడిశా రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ఒడిశా హెల్త్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఒడిశాలో కనీసం ఎనిమిది మంది మరణించారు.

22 వేలకు పెరిగిన పరీక్షలు
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని, ఒడిశాలోని ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో స్క్రబ్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షల సంఖ్యను 22 వేలకు పెంచినట్లు డైరెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ కాలానుగుణ పెరుగుదలపై నిఘా పెంచాలని ఒడిశా ప్రభుత్వం గత నెలలో జిల్లా ఆరోగ్య అధికారులను కోరింది. రాష్ట్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ అన్ని ప్రధాన జిల్లా వైద్య మరియు ప్రజారోగ్య అధికారులకు, క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

నివారణ కోసం ఇంటెన్సివ్ నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ కేసులు నమోదవుతున్నాయని ఒడిశా ఆరోగ్య శాఖ ప్రకటన తెలిపింది. అందువల్ల స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ నివారణకు ఇంటెన్సివ్ నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జిల్లా ఆరోగ్య అధికారుల నుంచి టెస్టింగ్ కిట్‌లను కొనుగోలు చేసి సరఫరా చేయడం, పీయూఓ విషయంలో వైద్యులకు సలహాలు ఇచ్చేలా వైద్యులకు అవగాహన కల్పించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, నిఘా పెంచడం ద్వారా డీపీహెచ్‌ఎల్‌లో పరీక్షలు అందుబాటులో ఉండేలా ఆరోగ్య శాఖ తక్షణ చర్యలు చేపట్టింది.

స్క్రబ్ టైఫస్ వ్యాధి ఎలా వస్తుంది?
తగిన యాంటీబయాటిక్స్ వాడాలని, మందులను తగినంత నిల్వ ఉంచాలని డిపార్ట్‌మెంట్ అధికారులను కోరింది. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. స్క్రబ్ టైఫస్ సోకిన లార్వా పురుగుల కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. ఇవి చెట్లలో ఉంటాయి. పొలాల్లో ఎక్కువగా ఉండేవారు, అడవులకు వెళ్లేవారు వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి:

Narges Mohammadi: మానవ హక్కుల పోరాటంలో ఉక్కు సంకల్పం.. ఇరాన్ మహిళ నర్గెస్ మహ్మదీకు నోబెల్ శాంతి బహుమతి

Green ink signature : గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే గ్రీన్ ఇంక్ పెన్నుతో ఎందుకు సంతకం పెడతారో తెలుసా?