వారు చెబితే వినాలి : ఇకపై పిల్లలే టీచర్లకు మార్కులేస్తారు

  • Published By: veegamteam ,Published On : August 30, 2019 / 06:48 AM IST
వారు చెబితే వినాలి : ఇకపై పిల్లలే టీచర్లకు మార్కులేస్తారు

Updated On : August 30, 2019 / 6:48 AM IST

పరీక్షలు రాసిన విద్యార్థులకు టీచర్లు మార్కులేస్తుంటారు. ర్యాంకులు ఇస్తుంటారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ కానుంది. ఇకపై విద్యార్థులే టీచర్లకు మార్కులు, ర్యాంకులు ఇవ్వనున్నారు. టీచర్ల పనితీరును బట్టి విద్యార్థులు టీచర్లకు మార్కులు వేయనున్నారు. టీచర్లకు వచ్చిన ర్యాంకులను బట్టే వారి జీతాలు పెరగటం ఆధారపడి ఉంది. ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది ఒడిశా ప్రభుత్వం. 

టీచర్లు విద్యార్థులకు చెప్పే పాఠాలను బట్టీ.. టీచర్లు వ్యవహరించే తీరు వంటి కీలక అంశాలను విద్యార్థులు గమనించి  టీచర్లకు మార్కులు ఇస్తారు. ఆ రేటింగ్ లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. వారి పనితీరు ఆధారంగానే ఇంక్రిమెంట్లు, జీతాల పెంపు ఉంటుందని ఒడిషా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

పిల్లలు మార్కులు వేసే విధానాన్ని కూడా ప్రకటించింది సర్కార్. ప్రతి క్లాస్ పూర్తయిన తర్వాత విద్యార్ధులు తమ టీచర్ల టీచింగ్.. వ్యవహరించే పద్ధతిపై ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. మొత్తం 10 పాయింట్లకు విద్యార్ధులు ఇచ్చే రేటింగ్‌ను బట్టే ఉపాధ్యాయుల పనితీరుపై ప్రభుత్వం ఓ అంచనాకు వస్తుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఒడిశా స్కూల్  విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
 
ఈ అంశంపై విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ… ఇకపై విద్యార్ధుల నుంచి  ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నాం. ప్రతి క్లాస్ రూమ్ లోను దీనికి ఓ రిజిస్టర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారాయన. టీచర్లు పిల్లలకు క్లాస్ చెప్పటానికి వచ్చిన టైమ్.. అయిపోయాక వెళ్లిపోయిన టైమ్ తో పాటు ఆ రోజు టీచర్లు చెప్పిన పాఠాలు.. క్లాస్ లో హాజరైన విద్యార్ధుల సంఖ్య రాయాల్సి ఉంటుందని వివరించారాయన. ప్రతి క్లాస్ తర్వాత విద్యార్ధుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామనీ.. విద్యార్ధులకు ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే అందులో రాయవచ్చునని తెలిపారు మంత్రి. తద్వారా ఉపాధ్యాయులు తమ బోధనను మెరుగుపర్చుకో వచ్చన్నారు.