యూపీలో అధికారుల బదిలీలు : సీఎం యోగి సంచలన నిర్ణయం

  • Published By: chvmurthy ,Published On : February 17, 2019 / 05:16 AM IST
యూపీలో అధికారుల బదిలీలు : సీఎం యోగి సంచలన నిర్ణయం

Updated On : February 17, 2019 / 5:16 AM IST

లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున  సీఎం యోగి ఆదిత్యనాధ్ చేపట్టిన  ఈబదిలీలు సంచలనం అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో పలువురు ఉన్నతాధికారులకు స్ధానచలనం కలిగింది. 

22 జిల్లాల మేజిస్ట్రేట్‌లతో పాటు 64 మంది ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.  ట్రాన్సఫర్ అయిన వారిలో పలు డివిజనల్‌ కమీషనర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులూ ఉన్నారు. మరోవైపు 107 మంది సీనియర్‌ ప్రొవిజనల్‌ సివిల్‌ సర్వీస్‌ (పీసీఎస్‌) అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం యూపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్‌ డివిజనల్‌, సిటీ మేజిస్ర్టేట్‌ స్ధాయి అధికారులను పెద్దసంఖ్యలో బదిలీ చేసింది.