కేజ్రీని అట్రాక్ట్ చేసిన వీడియో.. అతనిని కలవాలని ఉంది

ఢిల్లీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ వీడియోకు ఆకర్షితులయ్యారు సీఎం కేజ్రీవాల్. వీడియోలో ఉన్న కుర్రాడిని కలవాలని అనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది. కేజ్రీవాల్‌కు అంతగా నచ్చడంలో విశేషం ఏముంది ?
ప్రస్తుతం దేశంలో ఉల్లిగడ్డల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో కిలో రూ. 100 నుంచి రూ .120 దాక పలుకుతోంది. దీంతో జనాలు ఉల్లిగడ్డలను కొనడానికి జంకుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ కూరగాయల మార్కట్‌లో ఓ వ్యాపారి కిలో ఉల్లిగడ్డలను రూ. 40కి అమ్ముతున్నాడు. కిలో ఉల్లిగడ్డ రూ. 40 మాత్రమే అని అరుస్తూ విక్రయిస్తున్నాడు. వచ్చిన కస్టమర్లకు క్యారీ బాగ్స్ ఇస్తూ అరుస్తున్నాడు.
Read More : అంబేద్కర్ స్మారక వనానికి రూ. 1000 కోట్లు
అయితే..మధ్య మధ్యలో జై కే్జ్రీవాల్, అప్ కీ బార్ కేజ్రీవాల్ సర్కార అనే నినాదాలు చేశాడు. కానీ అతను మాత్రం ఆప్ కార్యర్తగా కనిపించడం లేదు. కేవలం ఒక సామాన్య వక్తిగా కనిపిస్తున్నాడు. మార్కెట్‌లో ఉన్న ఓ వ్యక్తి దీనిని సెల్ ఫోన్‌లో బందించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో కేజ్రీవాల్ దృష్టికి వచ్చింది. ఎవరో ఈ వీడియోను పంపించారని, ప్రేమను వ్యక్తం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయని ట్వీట్‌లో వెల్లడించారు. ఆ కుర్రాణ్ని కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
आज किसी ने ये विडीओ भेजा।
प्यार का इज़हार करने का अनोखा तरीक़ा
I would love to meet him. pic.twitter.com/VH8Jt6smeM
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 15, 2020