Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు, పాకిస్తాన్‌పై జాలి చూపేది లేదు- యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని భారత్ ఒక విధంగా చూస్తుందన్నారు.

Operation Sindoor: పాకిస్తాన్ తో యుద్ధం ముగియలేదని ప్రకటించారు ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ వేదికగా ఆపరేషన్ సిందూర్ పై స్పష్టతనిచ్చారు ప్రధాని మోదీ. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని క్లారిటీ ఇస్తూనే పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని మోదీ. బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉగ్ర స్థావరాలను చిత్తుచిత్తు చేశాయన్నారు.
ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని భారత్ ఒక విధంగా చూస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై జాలి చూపేది లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పేశారు. ఇక భారత్ దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. మేకిన్ ఇండియా వెపన్స్ పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజెప్పామన్నారు. ప్రత్యేకంగా బ్రహ్మోస్ మిస్సైల్స్ ను ప్రశంసలతో ముంచెత్తారు. టెర్రిస్టుల క్యాంప్ లను బ్రహ్మోస్ క్షిపణులు ధ్వంసం చేశాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్ ఎటువంటి అణ్వాయుధ దాడులకు భయపడదని తేల్చి చెప్పారు. భారత సాయుధ దళాల ప్రతీకార దాడుల్లో తన సైనిక వ్యవస్థ నాశనమైన తర్వాత కాల్పుల విరమణ కోసం పాక్ మనల్ని వేడుకుందని ప్రధాని తెలిపారు. శత్రువును ఎక్కుడ దాక్కున్నా వదిలేది లేదు అంతు చూస్తాం అని అంటూ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు ప్రధాని మోదీ.
ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేసిన భారత సాయుధ దళాలను ప్రశంసించారు ప్రధాని మోదీ. మన సాయుధ దళాల పరాక్రమంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులు ఆపాలంటూ విజ్ఞప్తి చేసిందని ప్రధాని వెల్లడించారు.