No Confidence Motion: పార్లమెంటు నుంచి ‘ఇండియా’ ఔట్.. బాధ కలుగుతోందన్న ప్రధాని మోదీ

ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు

No Confidence Motion: పార్లమెంటు నుంచి ‘ఇండియా’ ఔట్.. బాధ కలుగుతోందన్న ప్రధాని మోదీ

Updated On : August 10, 2023 / 7:15 PM IST

Narendra Modi: అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లోక్ సభకు హాజరై ప్రసంగించారు. విపక్షాలు ప్రజల సమస్యలపై కాకుండా రాజకీయాల కోసమే పార్లమెంట్ సమావేశాన్ని వృధా చేస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే మోదీ ప్రసంగిస్తుండగా.. మణిపూర్ అంశంపై మోదీ నోరు విప్పాలంటూ విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే మోదీ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వెళ్లారు. అయితే విపక్షాలు ఫ్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున అదే పనిగా నినాదాలు చేశారు. దీంతో మోదీ ప్రసంగాన్ని స్పీకర్ ఓంబిర్లా ఒక్కసారిగా ఆపేశారు.

No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ

ఇరు పక్షాలు శాంతంగా ఉండాలని, ప్రధానమంత్రి ప్రసంగం కొనసాగుతోందని, ఆయన పూర్తిగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలోని ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా కోరారు. ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తుండగా, మరొకవైపు ప్రధాని ప్రసంగానికి కొనసాగింపుగా అధికార పక్షంలోని నేతలు కూడా అనుకూల నినాదాలు చేశారు. అయితే స్పీకర్ మాటలను విపక్షాలు లెక్కచేయలేదు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇక చేసేదేమీ లేక మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.


అయితే తమ డిమాండును ప్రధానమంత్రి లెక్కచేయకపోవడంతో ఇండియా కూటమిలోని విపక్షాలన్నీ పార్లమెంటు నుంచి వాకౌట్ చేశాయి. వెళ్లున్న విపక్షాల్ని చూసి ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. దేశం అంతా ఏకమై మణిపూర్ గురించి చర్చించాల్సిన సమయంలో విపక్షాలు వాకౌట్ చేయడం సరి కాదని అన్నారు. ఇందిరా గాంధీ నాయకత్వంలో ఇలా జరగలేదని ప్రధాని గుర్తు చేశారు. నేటి విపక్షాల తీరు చూసి తన హృదయం బాధిస్తోందని మోదీ అన్నారు.