No Confidence Motion : విపక్షాల కూటమి I.N.D.I.A కీలక నిర్ణయం.. మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం?

మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.

No Confidence Motion : విపక్షాల కూటమి I.N.D.I.A కీలక నిర్ణయం.. మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం?

No confidence motion

Updated On : July 26, 2023 / 4:01 PM IST

Opposition Parties Alliance I.N.D.I.A : మణిపూర్ అంశం దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న వేళ విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు కేంద్రంలోని మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు I.N.D.I.A కూటమి సిద్ధమైంది. దీంతో ఇవాళ (బుధవారం) లోక్ సభలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తీర్మాన ముసాయిదా సిద్ధమైందని, 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించాల్సివుందని కూటమి వర్గాలు తెలిపాయి.

అయితే ఇది ఏ మేరకు నిలుస్తుందన్నది ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠగా మారింది. మణిపూర్ పై పార్లమెంట్ లో ప్రధాని మోదీతో ఎలాగైనా మాట్లాడించాలని విపక్ష కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రధాని మాట్లాడటంతో తమకు పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందనేది I.N.D.I.A కూటమి యోచనగా ఉంది.

Manipur : మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో గన్‌తో మహిళను

మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
ఇవాళ (బుధవారం) అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల కంటే ముందే ఇవ్వాలనేది కూటమి ఆలోచనగా ఉంది.

ఉదయం 10.30 గంటలకు పార్లమెంటరీ కార్యాలయంలో హాజరు కావాలని ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. మణిపూర్ పై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పార్లమెంట్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని 26 పార్టీల నేతలు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 330 మంది సభ్యుల మద్దతు ఉంది.

Greater Noida: దేశ రాజధానిలో విపత్కర ఘటన.. వరద నీటిలో మునిగిపోయిన వందలాది కార్లు

అయితే I.N.D.I.A కూటమికి 140 మంది సభ్యుల సపోర్టు ఉంది. మరో 60 మంది ఎంపీలు ఏ కూటమిలోనూ లేరు. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీఏకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగి పోయింది.