Jammu and Kashmir : అర్నియా సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన…పాక్ కాల్పులను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

జమ్మూకశ్మీర్‌లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది....

Jammu and Kashmir : అర్నియా సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన…పాక్ కాల్పులను తిప్పికొట్టిన బీఎస్ఎఫ్

Bsf jawans

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లోని అర్నియాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్ సైన్యం అనూహ్యంగా జరిపిన కాల్పులకు భారత సైనికుల నుంచి తగిన ప్రతీకారం తీర్చుకున్నట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. జమ్మూలోని అర్నియా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్లు గురువారం రాత్రి అకారణంగా కాల్పులు జరిపారు.

Also Read :  ODI World Cup 2023 : ఇంగ్లాండ్ హ్యాట్రిక్ ఓట‌ములు.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ వైర‌ల్‌..

ఈ కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారు. క్షతగాత్రుడైన జవాన్ ను చికిత్స కోసం జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. గురువారం రాత్రి పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్ ను ప్రయోగించారని బీఎస్ఎఫ్ తెలిపింది. అక్టోబర్ 17వతేదీన అర్నియా సెక్టారులో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

Also Read :  Election Commission of India: ఎన్నికల్లో జప్తు చేసే కోట్ల రూపాయలను ఏం చేస్తారు?

జమ్మూకశ్మీరులోని నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్, పాక్ 2021 ఫిబ్రవరి 25వతేదీన కుదుర్చుకుంది. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 12 సార్లు ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి తెల్లవారుజామున లష్కరే తయ్యిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Also Read : Mukhtar Ansari: ముఖ్తార్ అన్సారీకి కోర్టులో చుక్కెదురు.. మరింత పెరిగిన కష్టాలు

ఈ ఎదురు కాల్పులతో కుప్వారాలో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలమైందని చినార్ కార్ఫ్స్ తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో చొరబాటు బిడ్ విఫలమైంది, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.