India Pakistan Tensions: పాకిస్తాన్ బరితెగింపు.. జమ్ము ఎయిర్ పోర్టుపై దాడి.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసిన భారత ఆర్మీ

వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసింది.

India Pakistan Tensions: పాకిస్తాన్ బరితెగింపు.. జమ్ము ఎయిర్ పోర్టుపై దాడి.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసిన భారత ఆర్మీ

Updated On : May 8, 2025 / 10:13 PM IST

India Pakistan Tensions: పాకిస్తాన్ బరితెగించింది. మరోసారి రెచ్చిపోయింది. ఓవైపు సరిహద్దు గ్రామాలపై కాల్పులు కొనసాగిస్తూనే.. మరోవైపు జమ్ము ఎయిర్ పోర్టుపై మిస్సైల్ దాడులు చేసింది పాకిస్తాన్. జమ్ముకశ్మీర్ లో 6 చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేసింది పాక్.

వెంటనే రంగంలోకి దిగిన భారత ఆర్మీ.. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చేసింది. మరోవైపు జమ్ము నగరం మొత్తం బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు.

* పాక్ ఎఫ్ 16 ను కూల్చేసిన భారత సైన్యం
* 3 పాక్ ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత్
* ఒక ఎఫ్-16, రెండు జేఎఫ్-17 ఫైటర్ జెట్లను కూల్చిన భారత్
* S-400తో పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ కూల్చివేత
* పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి పాక్ యత్నం
* జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పైనా దాడికి యత్నం
* జైసల్మేర్ లో పాక్ అన్ని డ్రోన్లను కూల్చేసిన భారత సైన్యం
* పాక్ దాడులను ధీటుగా తిప్పికొడుతున్న భారత ఆర్మీ
* శ్రీనగర్ ఎయిర్ పోర్టుపైనా పాక్ దాడికి యత్నించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్
* శ్రీనగర్ ఎయిర్ పోర్టు దగ్గర హై అలర్ట్

Also Read: పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టాం, దెబ్బతీశాం- కల్నల్ సోఫియా ఖురేషి

* శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ దగ్గర S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్
* శ్రీనగర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్
* జమ్ముకశ్మీర్ లో 6 చోట్ల డ్రోన్లు, మిస్సైల్స్ తో పాక్ దాడులు
* జమ్ములో పాక్ 10 డ్రోన్లు, 9 మిస్సైల్స్ కూల్చేసిన భారత ఆర్మీ
* జమ్ముకశ్మీర్ టార్గెట్ గా పాక్ దాడులు
* జమ్ము నగరం మొత్తం బ్లాక్ అవుట్
* జమ్ముకశ్మీర్ లో విద్యుత్ సరఫరా నిలిపివేత
* జమ్ముకశ్మీర్ లో సైరన్ల మోత
* ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు
* జమ్ముకశ్మీర్ తో పాటు రాజస్తాన్, పంజాబ్, గుజరాత్ బ్లాక్ అవుట్

* సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు
* సాంబా, రాజౌరి, పూంచ్ సెక్టార్ లో హెవీ ఫైరింగ్
* పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత సైన్యం
* పాక్ తో ఉన్న సరిహద్దులు మొత్తం బ్లాక్ అవుట్