Hardik Pandya : శ్రీలంక జాతీయగీతం పాడిన పాండ్యా.. వైరల్ వీడియో

ఆదివారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య శ్రీలంక జాతీయ గీతం ఆలపించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక దేశం ఆటగాళ్లు మరోదేశం జాతీయగీతం ఆలపించేందుకు ఆలోచిస్తారు.. కానీ పాండ్యమాత్రం శ్రీలంక ఆటగాళ్లను అనుకరిస్తూ జాతీయగీతం ఆలపించారు

Hardik Pandya : శ్రీలంక జాతీయగీతం పాడిన పాండ్యా.. వైరల్ వీడియో

Hardik Pandya

Updated On : July 26, 2021 / 3:15 PM IST

Hardik Pandya : ఏదైనా అంతర్జాతీయ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్లు జాతీయగీతం ఆలపిస్తాయన విషయం తెలిసిందే. ఏ దేశం ఆటగాళ్లు ఆ దేశం జాతీయగీతం ఆలపిస్తారు. అయితే ఒక దేశం ప్లేయర్లు జాతీయగీతం పాడుతున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు నిశ్శబ్దంగా ఉంటారు. ఒక జట్టు పాడడం అయిపోగానే.. మరో జట్టు ప్రారంభిస్తుంది.

అయితే ఆదివారం శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో జాతీయగీతాలాపనలో భారత ఆటగాడు హార్దిక్ పాండ్య శ్రీలంక ఆటగాళ్లు జాతీయగీతం పడుతుండగా వారిని అనుకరించారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో గతంలో ఎప్పుడు ఇటువంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవు.

అయితే పాండ్య శ్రీలంక జాతీయగీతం ఆలపిస్తూ కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలా పాడటం తప్పుకాకపోయిన ఇతర దేశాల జాతీయగీతాలు ఆలపించేందుకు ఆటగాళ్లు వెనుకాముందు ఆలోచిస్తారు.